జోహార్లు ;-ఎం. వి. ఉమాదేవి
 పదారేళ్ళ ప్రాయం నుండే 
కవాతుచేసే తీరు పరిశీలనతో 
విద్యతో వ్యాయామం కలిపేసి 
మెరికలా తయారయ్యినా.. 
సైనిక్ శిక్షణకు మాత్రం 
ఇంట్లో అంగీకారంలేకుంటే 
బతిమిలాడి ఒప్పించిచేరి 
అత్యంత కఠినఅభ్యాసం చేసి 
రొట్టెలు కూర పండుతో 
తేనీటి విందుతో 
దేశంనలుమూలల వారి పరిచయం 
సౌభ్రాతృత్వపు పరిమళమై.. 
సైనికులుగా ఆత్మవిశ్వాసం పొందినవారు. 
అవసరమైనపుడు.. 
కుటుంబం మరిచి కొండాకోనల్లో దాగి 
చేసే యుద్ధం, 
గాయపడినా వెనుదీయని తత్వంగా 
యువకులు,కొత్త పెళ్లి కొడుకులు,బాధ్యతల నడివయసు వారు.. 
దేశంకోసమే తృణప్రాయంగా వదిలిన దేహం !!
కప్పిన త్రివర్ణ పతాకగౌరవంతో.. 
సైనికులకు జోహార్లు !!

కామెంట్‌లు