అబిమానం ...!!------డా.కె.ఎల్.వి.ప్రసాద్.--- సఫిల్ గూడ.
 తప్పుఎవరిదన్న -
తర్జనభర్జనలు 
లేకుండగనే ...
గరికపాటి -చిరంజీవి 
గౌరవించుకున్నారు 
ఒకరినొకరు ....
అలయ్..బలయ్ 
ఆతిధ్యంలో .....!
మధ్యలో --
అభిమానుల 
మాటల యుద్దం 
అర్థపర్థం లేకుండా ..
అంబరాన్ని 
తాకుతున్నది 
లేనిపోని అనర్దాలకు 
తావిచ్చినట్టు 
అవుతున్నది ...!
అబిమానం అంటే 
హద్దులుదాటి -
ప్రవర్తించడం కాదు !
అభిమానించే వ్యక్తి 
మర్యాద కాపాడడం !!
               ***

కామెంట్‌లు