సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 మనసించు...మానసించు
*****
మనసించు అనగానే వేటిని మనసించాలి? వేటిని మనసించకూడదు అనే సందేహాలు మనసును కుమ్మరి పురుగులా తొలుస్తూ ఉండటం సహజం.
ఆ సందేహాలకు సమాధానం దొరకాలంటే మానసించాలి.అప్పుడే సరైన నిర్ణయానికి రాగలం.
 
మరి మనసించు అంటే ఏమిటో చూద్దామా...మనసించు అంటే ఇష్టపడు,ఇష్టించు,ఇచ్ఛగించు,చిత్తగించు,ప్రియంపడు,మనసు పెట్టు,మనస్కరించు,వలచు, హితవు పడు లాంటి అర్థాలు ఉన్నాయి.
క్రమశిక్షణాయుత జీవితాన్ని, నైతిక విలువలు,న్యాయం,ధర్మం లాంటి సద్గుణాలను మనసించాలి.
ఏదైనా పని చేసేటప్పుడు అది మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? అనే విషయంపై మానసించాలి.ఆలోచనలను మధించాలి, చేసే పనుల వల్ల కలిగే ఫలితాలను ముందుగానే తలపు చేయాలి. అప్పుడే చేసే వాటిల్లో స్పష్టత వస్తుంది.*
మానసించు అంటే ఏమిటో అర్థమై వుంటుంది... తలచు,తల్చు,భావించు, పరిగణించు,మధించు, సంస్మరించు, తలుపు చేయు అనే అర్థాలు ఉన్నాయి.
మనసించి చేస్తే  ఏదీ కష్టం అనిపించదు.మానసించి చేస్తే ఎప్పుడూ వైఫల్యం ఉండదు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు