గ్రూపుల ఘొష ..!!------డా.కె.ఎల్.వి.ప్రసాద్.---సఫిల్ గూడ.
అడ్మిన్ 
ఎవరో వుంటారు ..!
అత్యుత్సాహంతో 
ఒకగ్రూపు -
మొదలుపెడతారు !
తెలిసినవాళ్ళని ,
తెలియని వా ళ్ళని 
అందులో  చేరుష్తారు  !
అనుమతితీసుకోరు 
అది తమ గొప్పతనం -
అనుకుంటారు ....!
అందులో -
అడ్మిన్తో సహా చాలమంది 
స్వంత రచనలు చేయరు 
'ఎత్తిపోతల పదకం' చేపట్టి 
గ్రూపులో చెత్త నింపుతారు ...
తామేదో సాహిత్యసేవ -
చేస్తున్నట్టు ...
తెగమురిసిపోతారు ....!
తప్పయినా,ఒప్పైనా ...
మనస్వంత రచన 
ఏనాటికైనా -
మెరుగులు దిద్దుకుంటుంది 
సాహిత్యకారుడిగా 
సమాజంలో నిలబెడుతుంది !
మనకోసం --గ్రూపును 
ఉపయోగించుకోవాలి 
గ్రూపుగౌరవం నిలబెట్టాలి !!


కామెంట్‌లు
Shyamkumar chagal చెప్పారు…
సాహిత్య దొంగ సర్టిఫికేట్ లు,డాక్టర్రేట్ లు కూడ పెట్టుకుని చేస్తారు సాహిత్య సేవలు