ఓహో గులాబిపువ్వా!;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఎర్రగానున్నది
బుర్రగానున్నది
ఏమరుస్తున్నది
ఎదనుతట్టుచున్నది

బొద్దుగానున్నది
ముద్దుగానున్నది
మయిమరుపిస్తున్నది
ముచ్చటపరుస్తున్నది

అందముగానున్నది
ఆనందమునిస్తున్నది
ఆశనుకలిగిస్తున్నది
అంతరంగాన్నలరిస్తున్నది

తోడుకొస్తానంటున్నది
తీసుకొనిపొమ్మంటున్నది
తొందరపెడుతున్నది
తన్మయత్వపరుస్తున్నది

వెలుగుతున్నది
రగులుతున్నది
తాజాగున్నది
మోజుకలిగిస్తున్నది

విచ్చుకొనియున్నది
నచ్చుచున్నది
మెచ్చుకోవాలనియున్నది
కాచుకోమంటున్నది

గుండెలోగుచ్చుచున్నది
గుబులుపుట్టించుచున్నది
గుసగుసలాడుదామంటున్నది
గులపుట్టిస్తున్నది

షోకుగానున్నది
చూడమంటున్నది
సిగ్గులొలుకుచున్నది
సింగారించుకొనియున్నది

రంగేసుకొనియున్నది
రమ్యముగాయున్నది
రమ్మనిపిలుస్తుంది
రసఙ్ఞతనిస్తున్నది

వేచియున్నది
విరహములోనున్నది
వేడుకచేస్తానంటున్నది
వయ్యారలొలికిస్తున్నది

చిత్రముగానున్నది
చూడచక్కగాయున్నది
చిత్తరువులాయున్నది
చిత్తముదోచుచున్నది
========================
ఆగులాబి అదృష్టమేమో
ఆవృత్తపుష్పపు వృత్తాంతమేమో
ఆకుబ్జకముచేసుకున్న పుణ్యమేమో
ఆరోజా ఆకర్షణకుకారణమేమో

పువ్వుపంపిన పడతుకకు
పువ్వులేపిన ఆలోచనలకు
పుష్పకవితచదివిన పాఠకులకు
పలు ధన్యవాదాలు

కామెంట్‌లు