వెళ్ళారు ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చెరువులు జలముతొ నిండాయి 
చేపలు వలముగ పెరిగాయి 
పిల్లలు గాలము వేశారు 
చేపలు బాగా పట్టారు
మేలములాడుతు వారంతా 
చేపల వాలము పట్టుకుని
కేలము త్రిప్పుచు కోలము చేయుచు
కాలము తెలియక
ఎలముతో ఇళ్ళకు వెళ్ళారు !! 
=======================
{వలము = విస్తారము; మేలము = పరిహాసము; 
వాలము = తోక; కేలము=చెయ్యి; కోలము=నాట్యము; 
ఎలము = సంతోషము}

కామెంట్‌లు