పువ్వా పువ్వా!;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పువ్వా పువ్వా
తాజా పువ్వా
అందమైన పువ్వా
ఆనందమిచ్చే పువ్వా

వికసించే పువ్వా
విభవించే పువ్వా
పరిమళంచల్లే పువ్వా
పరవశపరచే పువ్వా

తేనెలుదాచే పువ్వా
తేటులపిలిచే పువ్వా
పుప్పొడియున్న పువ్వా
పిందెగమారే పువ్వా

ఎర్రరంగు పువ్వా
ఎదనుదోచే పువ్వా
తెల్లవన్నె పువ్వా
తేటతేట పువ్వా

పసుపువర్ణ పువ్వా
పడతులుమెచ్చే పువ్వా
గులాబిఛాయ పువ్వా
గుబాళించే పువ్వా

రంగురంగుల పువ్వా
రమణీయమైన పువ్వా
ఆకర్షించే పువ్వా
అలరించే పువ్వా

ప్రేమనుతెలిపే పువ్వా
ప్రేమికులనుకలిపే పువ్వా
కొప్పులకెక్కే పువ్వా
కోర్కెలులేపే పువ్వా

భ్రమలుకొలిపే పువ్వా
భామలుమెచ్చే పువ్వా
భక్తులుమెచ్చే పువ్వా
భగవానుడునచ్చే పువ్వా

సొగసులుచిమ్మే పువ్వా
మనసులుదోచే పువ్వా
ముచ్చటైన పువ్వా
మరులుకొలిపే పువ్వా

వాడిపోయే పువ్వా
ఒరిగిపోయే పువ్వా
రాలిపోయే పువ్వా
నేలచేరే పువ్వా


కామెంట్‌లు