ఫలితాలు;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
బాలల జట్లెన్నో ఆడుతున్నవి
పోటీలు పెట్టుకుని పాడుతున్నవి
తమని పరిశీలించమని పెద్దలను వేడుతున్నవి
ఓడినవి ఆప్రదేశాన్ని వీడుతున్నవి

ఫలితాలు వెంటవెంటనె మారుతున్నవి
జట్లుకొన్ని నియమాలను మీరుతున్నవి
బాలల చెమటలు ఏరులై పారుతున్నవి
జట్లన్ని విజయాన్ని కోరుతున్నవి

జట్లన్ని ప్రతిపాయింటును కూడుతున్నవి
తమకున్న బలాలను వాడుతున్నవి
ఎండవేడికి తలలన్నీ మాడుతున్నవి
అందుకే ఫలితాలు మూడుతున్నవి

మూడుజట్లు చివరకు చేరుకున్నవి
ఓడిన జట్లన్నీ జారుకున్నవి
జారుకున్న జట్లన్నీ ఊరుకున్నవి
కాని మూడుజట్ల ఫలితాలు మారకున్నవి


కామెంట్‌లు