ఆలోచన( *రుబాయీలు*)-ఉమామహేశ్వరి యాళ్ళ- విశాఖపట్టణం
 (01)
రచనలెన్నొ చేయాలని తపించాను నేనిప్పుడు
తలపులలో అలజడులను భరించాను నేనిప్పుడు
పిచ్చిరాత రాసిరాసి అలసిపోయి మానుకుంటి
సరస్వతీ కటాక్షమని గ్రహించాను నేనిప్పుడు
(02)
వ్రాయాలని కూచుంటే రాదుకదా ఆలోచన
ఏదోకటి రాసేస్తే  కాదుకదా ఆలోచన
నేడేమో రచయితలట జ్ఞానమసలు లేకుండా
కవితంటే అలుసుంటే అవదుకదా ఆలోచన
(03)
విరబూసెను వసంతాలు అలజడులను రేపేందుకు
కూస్తున్నవి శుకపికాలు అల్లరులను రేపేందుకు
యేతెంచగ చెలికాడే విరిసెనుగా ముఖపద్మం
చెలరేగెను తపనలన్ని  విరహాలను రేపేందుకు
*********************

కామెంట్‌లు