జగతికి వెన్నెముక స్త్రీ (5);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 చాలా మంది పురుష ఆధిక్యతను గురించి మాట్లాడుతూ ఉంటారు. స్త్రీ తక్కువదా  తనకు శక్తిసామర్థ్యాలు లేవా  మగవారు చేసే పనిని ఆడవారు చేయరా. విమానం నడపడం రైలు ప్రయాణం  బస్సు తోలడం  కార్యాలయాలలో అన్నిరకాల పనులు చేయడం  రాజ్యాంగంలో  దేశాలను పరిపాలించడంలో కూడా  తమ శక్తి సామర్థ్యాలను స్త్రీలు చూపించ లేదా. ప్రత్యక్ష ప్రమాణాలు  మీకు సాక్ష్యాలుగా చూపించవలసిన అవసరం ఉంది. లండన్ రాణి నుంచి భారతదేశాన్ని నడిపించిన ఇందిరాగాంధీ  శక్తియుక్తులను ప్రదర్శించే పరిపాలన సాగించలేదా.  పరిశోధనల రీత్యా కూడా  మగవాడికి మించి నాలుగు రెట్లు ఆలోచన చేయగలిగినది స్త్రీ అని చెప్పారు. మరి ఒకటికి నాలుగు రెట్లు తెలియని అజ్ఞానంలో నువ్వు మాట్లాడే మాటలను ప్రామాణికంగా తీసుకునే అవసరం ఉందా.
తెలుగుభాషకు వ్యాకరణాన్ని వ్రాసిన చిన్నయసూరి దానికి బాలవ్యాకరణము అని పేరు పెట్టాడు  ఇది మాకే అర్థం కావడం లేదు బాలలకు ఎలా అర్థం అవుతుంది అని అడిగారు పండితులు. దానికి సూరి చెప్పిన సమాధానం  బాల అన్నది ఒక జాతి శబ్దం కాదు. బాల శబ్దం ఆడ పిల్లలకు, మగ పిల్లలకు కూడా వర్తిస్తుంది. వారికి ప్రత్యేకంగా ఎందుకు అర్థం అవుతుందని నేను ఆలోచించానంటే  చిన్నపిల్లలలో ఉన్న మెదడు ధారణకు సాధనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆ వయసులో పిల్లలు అర్థం చేసుకున్న దానిని వారి జీవితంలో మరచి పోవడం జరగదు. అలాగే సాధన చేయడంలో కూడా వారిలో ఉన్న పట్టుదల అంకితభావం పెద్దవారిలో ఉండదు. కారణం నాకు వచ్చు కదా అన్న భావం బాలకు రావాలి అనే పట్టుదల ఆ భేదాలను గమనించాలి. పిల్లలను ఐదవ సంవత్సరం వచ్చేంతవరకు  ఎంతో గౌరవంగా ప్రేమగా చూడమంటారు. ఆడపిల్లలలో  లో 8 వ సంవత్సరంలోను  మగపిల్లలలో పన్నెండవ సంవత్సరంలోను మానసిక పరిణతి ప్రారంభం అవుతుంది. అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు  నిజానికి మనం ఇద్దరు పిల్లలను గమనించినట్లయితే  ఆడపిల్లలు చిన్నతనంలోనే సిగ్గు తెలిసి నగ్నంగా బయటకు రావడానికి  అంగీకరించారు. ఏదో ఒక వస్త్రాన్ని ధరించి తీరవలసినదే  మగవాడు అలా కాదు ఆమెకి సిగ్గు తెలిసిన నాలుగు సంవత్సరాలకు కానీ ఇతనికి తెలియదు  అప్పుడు వస్త్రధారణ మీద మనసు పడతాడు తప్ప అంతవరకు దిగంబరంగా ఉన్నా వాడేమీ చలించడు ఈ వేదాలు ఎవరు నేర్పారు. ఎవరు ఎలా విభజించారు  తత్వాలు కూడా  వ్యష్టి చేస్తే వ్యక్తి ఈ సమాజానికి ఉపయోగపడతాడు.

కామెంట్‌లు