చిన్నతనం నుంచి పిల్లలలో ఒక రకమైన అభిలాష కోరిక ఉంటుంది దొడ్లో దూడలను చూసినప్పుడు ప్రత్యేకించి గిత్తలను వాటితో పాటు పరువులెత్తడం ఆడడం ఎంతో ముచ్చటగా ఉంటుంది మరి కొంతమందికి పూల చెట్లను పెంచాలని వాటి విత్తనాలను తీసుకొచ్చి చక్కగా పెంచుతారు. ఒక చెట్టు అందంగా ఉండాలి అంటే దాని పెంపకం తెలియాలి తాను ఏ చెట్టును పెంచాలనుకుంటున్నాడో దాని బీజం అంటే విత్తు సరైన దానిని తీసుకొని బాగా కడిగి నీళ్లలో వేసి అది తేలుతుందా మునుగుతుందా అని చూసి తేలితే బయట పరవేయడం మునిగితే దాన్ని భూమిలో నాటడం దానికి నిత్యం నీరు పోస్తూ ఉంటే కొద్దికొద్దిగా పెరుగుతూ ఉంటుంది. అది ఎంత పెరుగుతూ ఉంటుందో దానిని అంచనా వేసుకుని వంకర టింకర లేకుండా తిన్నగా పెరగడానికి ఈ కుర్రవాడు సహకరిస్తాడు.
అలాగే కొన్ని ఇండ్లలో పూల పందిరిని చూస్తాం చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుందో మరి ఆ ఆలోచన చేసినది దానిని పెంచడానికి కృషి చేసినది ఆ ఇంటి కుర్రవాడైతే అది పెరుగుతున్న కొలది దానిని తీర్చిదిద్ది దానికోసం ప్రత్యేకంగా పందిరి వేసి దాని పైకి అందంగా ఒక వరుసలో వెళ్ళేట్లుగా ఏర్పాటు చేస్తే చూపరులకు ఎంత కనువిందు చేస్తుంది. మరి ఈ ఆలోచన వచ్చిన కుర్రవాడి మనసులో ఇంకా ఎన్ని గొప్ప గొప్ప ఆలోచనలు వుంటాయి. ఆ వచ్చిన వాటికి పెద్దల సహకారం ప్రోత్సాహం ఉంటే అతను ప్రపంచాన్ని జయించినంత ఉత్సాహాన్ని పొంది ఆ స్ఫూర్తితో తనకు మించిన కృషిచేసి తల్లిదండ్రులు ఆశించిన ఫలితం కన్నా మరింత ఎక్కువగా దానిని విజయవంతంగా పొందడానికి ప్రయత్నం చేసి తప్పకుండా సఫలీకృతుడు అవుతాడు
ఈ ప్రపంచంలో ఉత్తమ పౌరునిగా జీవించాడంటే బీజం ఆ పసితనంలోనే పడాలి ఆ బీజాన్ని కడిగి మంచిదా చెడ్డదా అని ఆ కుర్రవాడు పరీక్షించినట్లుగానే ఉపాధ్యాయుడు ఈ కుర్రవాడిని పరిశీలనగా గమనించి చదవాలన్న కోరిక ఉన్నదా లేక పెద్దలు బలవంతం చేస్తున్నారు కనుక వస్తున్నాడా అనే విషయాన్ని ఇట్టే గ్రహించగలడు. గ్రహించిన వెంటనే రెడ్డిగారి లాంటి కుర్రవాళ్లను కాస్త శ్రద్ధగా చూస్తూ మిగిలిన వారందరి కంటే ఉత్తమునిగా తయారు చేసే బాధ్యత తీసుకుంటారు ఆ కుర్రవాడు ఆ చెట్టును పెంచిన పద్ధతిలో ఎప్పుడైతే ఉపాధ్యాయులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయో తనకున్న సందేహాలను వినిపించడానికి ఎలాంటి సంశయము ఉండదు కన్న తండ్రి వద్ద తన మనసులో ఉన్న మాటను ఎలా విప్పి చెప్పగలడో నాకు ఇది తెలియడం లేదు దీని అర్థం చెప్పండి అని అడిగే ధైర్యం వస్తుంది. నిజానికి విద్యార్థి లక్షణం కూడా అదే. నేను జీతం కడుతున్నాను నాకు చదువు చెప్పవలసిన బాధ్యత నీకున్నది కనుక చెప్పు అన్న ఆలోచన అతని మనసులోకి వస్తే చెట్టుకు చీడపురుగు వస్తే ఆ చెట్టు మొత్తం ఎలా నాశనం అయిపోతుందో అలా ఈ కుర్రవాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది ఇలాంటి భేదాభిప్రాయాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు దానిని చక్కగా పరిష్కరించగలిగి అతని బాధ్యతను గుర్తు చేయవలసిన బాధ్యత అధ్యాపకులకు ఉంటుంది అక్కడ చీడపీడలు వచ్చినప్పుడు దానిని నివారించే బాధ్యత ఆ కుర్రవాడు ఎలా నిర్వహిస్తాడో అలా చేస్తాడు గురువుగారు. విద్యార్థి అంటేనే విద్యను అర్ధించేవాడు విద్ అంటే జ్ఞానం అది నాకు లేదు ఆ జ్ఞానాన్ని పెంచండి సమస్యల చీకటిలో ఉన్న నన్ను వెలుగులోకి నడిపించండి అని భగవత్ స్వరూపంగా ఉన్న ఆ గురువుగారిని వేడిన వాడు తప్పకుండా వృద్ధిలోకి వస్తాడు ఎన్ని దెబ్బలు తింటే అంత అనుభవం పెరుగుతుంది అని జీవితంలో మన పెద్దలు మనకు చెప్పిన నీతి.
గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (50)-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి