అమ్మ వైద్యం;-డా.నీలం స్వాతి,--చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 అమ్మ చేసే కూరల్లో వాడే పోపు సామాన్లులో  కరివేపాకు రసం  జీర్ణక్రియకు తోడ్పడుతుంది  మెంతులు గురించి చెబుతూ  అది మధుమేహాన్ని తగ్గిస్తుంది అని చెప్పాను గుర్తుంది కదా. ఇప్పుడు మిగిలిన పదార్థాలు ఎందుకు వాడతారు ఆ వాడటం వల్ల మనకు ఎలాంటి  మంచి జరుగుతుందో నిజానికి అమ్మ మనకు చెప్పి ఉండదు.  అమ్మకు వారి అమ్మ కూడా చెప్పదు  ఎందుకంటే పెద్దవారు విషయాన్ని చెప్పేటప్పుడు ఏం చేయాలో చెబుతారు తప్ప అలా ఎందుకు చేయాలో చెప్పరు. కారణం వారి పెద్దలు వారికి చెప్పకపోవడం  ఆయుర్వేద వైద్యులు చెప్పిన ప్రకారం. చరక మహర్షి ఎంతో శోధన పరిశోధన చేసి చెప్పిన విషయాలను ఆచరించడం తప్ప దాని మూలాలకు వారు వెళ్ళరు తెలుసుకోవాలని కూడా వారికి ఉండదు. కనుక నాలాంటి చిన్న వైద్యుల అవసరం తప్పకుండా వుంటుంది చెప్తాను వినండి అమ్మ ఏ కూర చేసినా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లేకుండా చేయదు ఉల్లిపాయ ఘాటు వాసన వస్తుంది  అది తిన్న తర్వాత రెండు గంటల వరకు ఆ వాసన పోదు  అయినా ఎందుకు వాడుతుంది  నిజానికి ఉల్లి చేసిన మేలు అమ్మ కూడా చేయదు అని ఒక సామెత బిడ్డకు ఏ కొంచెం నడతగా ఉన్నా అమ్మ ఎంత బాధ పడుతుంది ఎన్ని సపర్యలు చేస్తుంది. ఈ ఉల్లిపాయ నీ శరీరం లోపల ఉన్న రుగ్మతలను అతి తేలికగా తీసిపారేస్తుంది  ఉదాహరణకు మధుమేహ గ్రస్తులకు వరసగా పది రోజులు పచ్చి ఉల్లిపాయలు తినిపిస్తే మళ్లీ ఆ శరీరంలో మధుమేహ వ్యాధి కనిపించను కూడా కనిపించదు అన్ని వ్యాధులకు మూలమైన మధుమేహాన్ని పది పదిహేను రోజుల్లో అది తగ్గిస్తుంది కనుక కూరలో వాడుతుంది అమ్మ.
తిరగమోతలో అమ్మ పచ్చి మిరపకాయలతో పాటు ఎండు మిరపకాయలు కూడా వేస్తుంది. మిరపకాయ కారం కదా తినడానికి ఇష్టం ఉండదు పిల్లలకు. అయినా సమపాళ్లలో వేసి అమ్మ రుచికరంగా తయారు చేస్తుంది దాని వలన ఏమిటి ఉపయోగం అని అడిగితే దాదాపు క్యాన్సర్ అన్న  వ్యాధిని దగ్గరకు రానీయకుండా కాపాడుతుంది. అలాంటి చక్కటి మందులు కనుగొన్న అమ్మకు ముందు అభినందనలు చెబుదాం. జీలకర్ర లేకపోయినట్లయితే కూరకు రుచి రాదు దానివల్ల  మనిషికి ఏమిటి లాభం అని అడిగితే  జీలకర్ర పచ్చిది మామూలుగా నమిలి దాని రసం తిన్నా లేక కూరలలో దానిని వాడినా ఏ విధమైన రుగ్మతలు రాకుండా కాపాడుతుంది  ప్రత్యేకంగా పైత్యాన్ని దగ్గరకు రాకుండా చేసేది  ఈ జీలకర్ర  వీటిని అన్నిటిని నూనెలో వేసి కాల్చడం వల్ల ఆ నూనె శరీరానికి కావలసిన కొవ్వు పదార్థాన్ని మనకి అందిస్తుంది  కనుక అమ్మ ఇంటిలో వైద్యురాలు అని మనం చెప్పుకోవడం.


కామెంట్‌లు