అనగనగా ఒక గ్రామం ఉండేది. అల్లిపూర్. ఆ గ్రామంలో నలుగురు స్నేహితులు ఉండేవారు. వాళ్ల పేర్లు ఉదయ్, రమేష్, నిఖిల్, రాము వీళ్ళందరూ చాలా కలిసిమెలిసి ఉండేవారు. వాళ్ళందరూ వాళ్ళ గ్రామంలో ఉన్న బడిలో చదువుకున్నారు. అట్లా వాళ్ళ చదువులను క్రమశిక్షణగా పూర్తి చేస్తారు. వాళ్ళందరూ ఉద్యోగాలు వచ్చి పట్టణానికి వెళ్ళిపోతారు. అట్లా వాళ్ళ జీవనాన్ని సాగిస్తారు. వాళ్లందరికీ మంచి పేరు ఉన్నది. మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. కొద్ది సంవత్సరాలు తర్వాత వారందరూ వాళ్ల గ్రామానికి తిరిగి వస్తారు. వాళ్ళందరూ ఒకరోజు ఒక ఛాయ్ హోటల్లో కలుస్తారు. ఆ చాయ్ హోటల్లో ఒక శేఖర్ అనే వ్యక్తి ఉండేవాడు. శేఖర్ హోటల్ కి ఓనర్. వీరందరూ చాయ్ తీసుకొని వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అట్లా వాళ్ళ పాత సంఘటనలను గుర్తు చేసుకున్నారు. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వారందరూ ఒక 50 సంవత్సరాలు తర్వాత కలుసుకున్నారు కాబట్టి వారందరిముఖంలో చాలా ఆనందం వెలిగిపోతుంది. తర్వాత వారందరూ ఒక షేర్తుఅనుకుంటారు వారందరూ దానిని ఒప్పుకున్నారు. అలానే వాళ్ళు షర్తులు చాయ్ హోటల్ శేఖర్ కూడా ఉన్నాడు. తరువాత 50 సంవత్సరాలు గడిచాక వాళ్ళందరూ చాయ్ హోటల్ దగ్గరికి వస్తారు. చాయ్ హోటల్లో ఎవరు ఉండరు. కొద్ది సమయం తర్వాత వీళ్ళ నుంచి ముగ్గురు స్నేహితులు లోపలికి వెళ్తారు. అక్కడ నిఖిల్ రాలేడు ఏమిటి అని ముగ్గురు స్నేహితులు చూస్తూ ఉంటారు. కాసేపు తర్వాత శేఖర్ వస్తాడు. చాయ్ తీసుకోండి మీ స్నేహితుడు కాసేపు తర్వాత వస్తా అని అన్నాడు అని శేఖర్ అంటాడు. సరే అని వారందరూ చాయ్ తాగి కబుర్లు చెప్పుకుంటారు. అలా కాసేపు తర్వాత భోజనం తయారు చేస్తాడు శేఖర్. ఇంకా నిఖిల్ రాలేదేంటి అని ముగ్గురు స్నేహితులు చూస్తారు. మీరు భోజనం చేయండి మీ స్నేహితుడు వస్తున్నాడు అని అంటాడు శేఖర్. చేస్తారు. తర్వాత కబుర్లు చెప్పుకుంటూ సాయంత్రం దాకా హోటల్లోనే ఉంటారు. ఇంకా రాలేదేంటి అని వారందరూ బయటికి వస్తారు. బయటికి వచ్చిన తర్వాత ఒక పిల్లవాడు వచ్చి వీళ్ళ కాళ్ళ పైన పడతాడు. ఆ పిల్లవాడు ఎవరంటే నిఖిల్ వాళ్ళ అబ్బాయి. అతని పేరే నిఖిల్ చరణ్ విషయం ఏంటి అని వీరు ముగ్గురు స్నేహితులు అడుగుతారు. నన్ను క్షమించండి అని చెప్పి ఆ పిల్లవాడు మా నాన్న చనిపోయి నెల అయితుంది అని చెప్తాడు. మరి మాకెందుకు చెప్పలే అని వీరు అంటారు. మీరు 50 సంవత్సరాల నుండి ఈరోజు కలుసుకుందామని మా నాన్న నేను చిన్నప్పటి నుండి చెప్పేవాడు. నేను వచ్చి మా నాన్న చనిపోయిండు అని చెప్తే ఇంతదాకా మీరు సంతోషాన్ని చూడకపోయేవారు. మీ ఆనందాన్ని కూలిపోవద్దని నేను ఇంత దాకా చెప్పలేను ఇంకా నన్ను క్షమించండి. మా నాన్న మీ గురించి ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. మా స్నేహితులు 50 సంవత్సరాల తర్వాత కలుద్దామని ఎప్పటినుండో అంటూ ఉన్నారు. అని చెప్తూ ఉండేవాడు. ఆ విషయం విన్నాక శేఖర్ అంటాడు ఈ భోజనాలు ఇవన్నీ నాకు మీకు నచ్చిన భోజనాలు చెప్పింది అంతా నిఖిల్
చెప్పాడు.
నీతి: మనం ఎప్పుడైనా మాట చెపినా మాట తప్పకూడదు. మనం మాట చెప్పినాక వారు ఉన్నా లేకపోయినా చేసి చూపియ్యాలి. పై కథలో నిఖిల్ చనిపోయాక కూడా వాళ్ల పిల్లవాడికి చేసి చూపిమని చెప్పాడు. మన సమాజంలో కూడా మనం ఏ మనుషులు ఉన్నా లేకపోయినా చేసి చూపియాలి మాట అంటే.
చెప్పాడు.
నీతి: మనం ఎప్పుడైనా మాట చెపినా మాట తప్పకూడదు. మనం మాట చెప్పినాక వారు ఉన్నా లేకపోయినా చేసి చూపియ్యాలి. పై కథలో నిఖిల్ చనిపోయాక కూడా వాళ్ల పిల్లవాడికి చేసి చూపిమని చెప్పాడు. మన సమాజంలో కూడా మనం ఏ మనుషులు ఉన్నా లేకపోయినా చేసి చూపియాలి మాట అంటే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి