మంచు బొమ్మ ;-యలమర్తి చంద్రకళ--8008915928-విజయవాడ
 "అక్కా..లేవే.".చెవిలో గుస గుస గా తమ్ముడు పిలుపువల్ల నిద్రా భంగం అయ్యిందని వాడి వంక చిరాకుగా చూసి, "ఉష్..పోరా" అంటూ కసిరి రగ్గు ని...తలమీద వరకూ కప్పుకుని నిద్రపోయింది.
 
"అక్కా...లేవే...నిద్రపోతే అన్నీ మరిచిపోతావు నువ్వు. సరే నిద్రపో ..నే వెళుతున్నా"
'మళ్ళీ పిలవలేదని ఏడవకు" తలుపు వేసినచప్పుడయ్యింది.
 లక్ష్మికి మెలకువ వచ్చేసింది ముందు రోజు వేసుకున్న రహస్య పధకం గుర్తువచ్చి,  గబ‌గబా మంచం దిగింది.  
"ఆగరాచింటూ.."అంటూ...స్వెట్టర్ 
వేసుకుని చేతులకు గ్లోవ్స్ తొడిగి,
మరో  జతబట్టలు,బాటరీలైట్ తీసుకుని, చలవఅద్దాలు పెట్టు
కుని, హడావిడిగా ఇంకొన్ని సామాన్లు పట్టుకుని తనూ తమ్మడి వెనకే పరుగులాంటి నడకతో బయటకు నడిచింది.
***
"చింటూ కానీ ఇంకా తవ్వు,ఇంకా కావాలి త్వరగ రా  టార్చిలైట్ ఆఫ్ అయింది. మళ్ళీ  ఆన్ చెయ్యి జాగ్రత్త, లేకపోతే అమ్మదగ్గర చీవాట్లు వినాల్సి వస్తుందిరా' 
చకచకా పనిపూర్తి చేసేసారు.
"అద్భుతం బావుంది"  ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ముందరి  రోజే భారతదేశం నుండి అమెరికా వచ్చిన  అమ్మమ్మ, తాతయ్య లను అద్దాల తలుపుల  దగ్గరకు తీసుకువెళ్ళారు.  
 "వింత చూపిస్తాం"  అన్న మనవ
లతో...ఏంటర్రా  హడావిడి  ,చొక్కా‌
లాగు,,కళ్ళ జోడుతో  ఘనిషిలా వున్న మంచు ఆకారం చూసి ఆశ్చర్యపోతూ "ఏమిటది? "
"మంచుమనిషి "  ఒకేసారి  జంట కవుల్లా మనవలిద్దరూ ఏక ఖంఠం తో చెప్పారు.
"బావుందర్రా ఇదన్నమాట  పొద్దున్నే అక్కా, తమ్ముడు వెళ్ళి చేసిన పని." మెచ్చుకుని పిల్లల్ని దగ్గరకు తీసుకునిమురిసిపో
యారు.
"మేమూ చేసే వాళ్ళం ఇలాంటివి అన్నారు"తాతగారు.
అవునా అని ఆశ్చర్యపోతున్న మనవలతో, "అవునర్రా. "
"ఆ.... మేం చొక్కా, పంట్లాము
లలో గడ్డికూరి పొలంలో పెట్టే
వాళ్ళం."
"దాని పేరేంటి తాతా'?
"మీ భాషలో "స్కేర్ క్రో" అంటే కాకిబొమ్మ అని అంటారు.
మేము వూళ్ళో చేసేదాన్ని  దిష్టి
బొమ్మ" ఆంటారు. 
తాతగారి మాటలకి పిల్లలు చప్పట్లుకొట్టి "భలే అయితే
మేమూ చేస్తాం ఈసారి మనదేశం వచ్చినపుడు మనపొలంలో".
అలా పిల్లలు హుషారుగా అనగా
నే అందరి ముఖాల్లో ఆనందం
తొంగి చూసింది.
**


కామెంట్‌లు