నీతికథ:- తే.గీ:-పద్యాలు;-మమత ఐలహైదరాబాద్--9247593432
 తే.గీ
కాకి పలుకులన్ వినిమౌని కలతదీర్చ
సిద్ధపడి జెప్పె నొకమాట ముద్దుగాను
నీదు రూపంబు మార్చెద నిజముగాను
చెప్పుమేపక్షి రూపాన్ని చేయవలెనొ
తే.గీ
అనిన మునిమాట వినిచెప్పె ఘనతతోడ
హంసలుండేను నెప్పుడానందముగను
తెలుపు రంగుతోడందంగ తిరుగుచుండు
గాన మార్చుమనెను హంసగాను కాకి

కామెంట్‌లు