దరహాసమందహాసాలు కలబోసిన
విరజాజుల నవ్వులలో కమనీయం
రాధామాధవీయం, ఏమి ఆనందం
ఏమి సంతోషం,మది నిండెసుగంధం!!!
మరపురాని బాధ,నీ రాధ గాధ,మనసునిండె
మాధవా!,రాధను రా కృష్ణ యదలోనిబాధని,
బృందలోన నను వదిలి మధుర కేగినావా,
మాటలేదు పలుకులేదు నీ మది నేను లేనా?
నా మనసు నీకు తెలియదా మురళీధరా!!
మమతల మహాసంద్రాన నను మరచి
మరుగున దాగిన,ఓ వెన్న దొంగ ఏల
కరుణలేదు ,వేచి వేచి , నా అనురాగమంత
నీరాయె కనుచెలమల,ధారాపాతమాయె,
. మనసును దోచి మరచితివా మాధవా?
నీ మది నిండా నిండిన మధురమైన బాధని
నీ రాధని ,కృష్ణా! పలుకవా,పలుకరించలేవా?
వేచి వేచి ,యెద నిలవలేక నీదరి జేర
పరుగులిడ , ఏమి చేత కమనీయహృదయా!!!
కారుణ్య మూర్తి కడతేర్చవా నను జేరవా!!!
. నీ మోహన మురళీ గానం కడసారి వీనుల
విందొనరించ రాగదయ్యా, వేణుగాన లోలా,
తనువులు వేరయినా మన మొకటే నన్నావు!
. నీదు ఒడి నాదుస్వర్గము,మురళీగాన
మధురిమ చేర్చు కృష్ణా, నా ఆఖరిశ్వాస
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి