లేతమనసున్న లేలేత చిగురువంటి,
సున్నిత మానసి, మాబుర్రిపాలెం
బుల్లోడు వచ్చాడు పాలమీగడలా
. వెన్నలా, వెన్నెల ఝల్లులా,మురి
పాల నురగలా , అవతార మెత్తేడు
అల్లూరి సీతారామరాజులా కురిపించాడు
అగ్ని వర్షం!!!
పాడిపంటల భాగ్యసీమని మన
తెలుగు నాటని పొగిడినాడు
పంటల పండించ రక్తసంబంధ
బలం అవ్యాజమైనదన్నాడు!!
అలరించి నిజ జీవితాన పండించినాడు!
.సింహాసనాలు ఎన్ని అధిరోహించిన,
శక్తికి మించిన దేదన్నాడు!!
మోసగాళ్ళకు మోసగాళ్ళ ఎదిరించి
మీన,మేషాలు లెక్కింపక గూఢాచారిగా
. మా మాననీయ ,నటశేఖరుడు కృష్ణ !!!
మనసు కనుల నుపయోగించి అవే
కళ్ళతో జగమంతా తిలకించిన మహా
మహానుభావుడు!!
అందరం ఒకటన్నాడు అందుకే
రామ్ ,రాహీమ్, రాబర్టుగా అవతరించాడు
అందరివాడు ఈ బుర్రిపాలం బుల్లోడు!!
అందరం దేవుడు చేసిన మనుషుల
మేనని మనలో పోటీలెందుకనీ
హేమా హేమీ లేమిటనీ, చుట్టాలు న్నారని
జాగ్రత్త పడ్డ ఊరికిమొనగాడే కాదు!
ఊరందరి బాధల్లో,మండే గుండెల సేద
దీర్చుమొనగాడు కృష్ణ సాటి లేనిమేటి!!!
బోగీ పండుగ వచ్చిందని భోగభాగ్యాలు
సరిదూచక అందరం ఒకటన్నాడు!!
గడసరి అత్త సొగసరి కోడల తగవులు
తీర్చాడండి, ఈనాడు నాదండి, ప్రజారాజ్యం
మనదన్నాడు, పోరాటంలో విజయం కూడ
మనదేనండీ!!
పచ్చని సంసారం పదిమందీ మెచ్చ
ముద్దాయి కాదండి మురిపాల బుజ్జాయి
విశ్వనాధ నాయకుడు మన నటశేఖరుడు
శ్రీకృష్ణగారు వందనాలు వందనాలు!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి