1. హేమంత ఋతువు,
రెండు మాసాలు!
మార్గశిరం ,పుష్యం,
మాసాలు!
మంచు కురియు,
కాలాలు !
ఒళ్ళు కొరికే ,
శీతల జలాలు!
మార్గశిరం మహత్తు,
పుష్యం సంపత్తు, రామా!
2. "మాసాలలో ,
మార్గశిరం నేను!"
పరమాత్మ,
మాట శ్రద్ధగా విను!
ముక్తి మార్గాన,
సరిగా చను!
మాహాత్మ్యము,
చక్కగా కనుగొను!
మార్గశిరం మహత్తు ,
పుష్యం సంపత్తు, రామా!
3. మార్గశీర్షం మార్గశిరము !
ప్రతిదినము,పుణ్యప్రదము!
దైవకార్యం,
హోమం,అభిషేకము!
స్వయంగా ,
పరమాత్మ స్వీకారము!
మార్గశిరం మహత్తు,
పుష్యం సంపత్తు, రామా!
4. ప్రాతః కాల,
చన్నీటి స్నానాలు!
విష్ణు సహస్రనామ,
పారాయణాలు !
పవిత్రంగా ,
ధనుర్మాస దినాలు !
నిజ ,
మోక్షమార్గ సోపానాలు!
మార్గశిరం మహత్తు,
పుష్యం సంపత్తు, రామా!
5. శుద్ధ ఏకాదశి మోక్షదము!
ఉత్తరద్వార దర్శనము!
భగవద్గీత జననము!
మనిషికి మోక్ష నిర్దేశము!
మార్గశిరం మహత్తు,
పుష్యం సంపత్తు ,రామా!
6. పుష్యం శనికి ప్రత్యేకము!
శనికి తైలాభిషేకం నిత్యము!
ఏలినాటి శని దూరము !
సర్వ శుభాలు లభ్యము!
మార్గశిరం మహత్తు
పుష్యం సంపత్తు ,రామా!
7, శ్రీహరికి తులసి దళాలు!
శివునికి మారేడు దళాలు!
సూర్యుడికి జిల్లేడుసుమాలు!
ఈ మాసాన ప్రత్యేకతలు!
మార్గశిరం మహత్తు,
పుష్యం సంపత్తు, రామా!
8. పుష్య మాస విశేషం ,
వస్త్ర దానము!
చలి బాధను ,
ఆదుకోవడము !
సామాజిక ప్రయోజనం,
ఆశయము!
జనహితంగా,
జీవించడము!
మార్గశిరం మహత్తు,
పుష్యం సంపత్తు, రామా!
9. ముఖ్యమైన మూడు,
పండుగలు !
పీడలు కాలిపోయే,
భోగి మంటలు!
సంక్రాంతి,
పంటల నిండు గాదులు!
కనుమ ,
మన పశువుల పూజలు!
మార్గశిరం మహత్తు,
పుష్యం సంపత్తు, రామా!
10. పుష్య మాసం,
సూర్యోదయము!
సూర్యకాంతి,
యోగ చైతన్యము!
మనబుద్ధి ,
ప్రచోదనము!
బుద్ధి, ప్రాణాల పుష్టి ,
పుష్య మాసము!
మార్గశిరం మహత్తు ,
పుష్యం సంపత్తు , రామా!
________
హేమంతం-ఫలవంతం;-డా. పి.వి.ఎల్. సుబ్బారావు, 9442058797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి