నేటి బాలలే రేపటి పౌరులు;-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.--సెల్.9491387977.--నాగర్ కర్నూల్ జిల్లా.
ఈనాటి చిన్నారి బాలలం
రేపటి పొన్నారి పౌరులం
భరతఖండ నివాసులం 
అఖండ సుభాసుబోసులం !

భారతదేశమంటే మాకెంతో ప్రేమ
సందేశం తో పడతాం మేము శ్రమ
వీర నారీ మణుల కన్న ఈ దేశం
మా కందిస్తుంది ఓశుభ సందేశం !

ఇందిరాజీ నెహ్రూజీ శాస్త్రీజీ
వీరంతా మన దేశ ప్రధానులు
అని మేము తెలుసుకున్నంజి
వారి చక్కని పాలన విధానాలు !

వారందరినీ నిత్యం పూజిస్తాం
దీప దూప నైవేద్యంతో కొలుస్తాం
ప్రజలతో మమేకమై మేంనిలుస్తాం
దేశభక్తి స్థిరమని మెంఇక తలుస్తాం 

మా భరతమాత గర్భమందు
జన్మించిన వారలం వీరులం
అమరవీరశూరులం ధీరులం
సరిహద్దులో కాపు కాయు వారలం

నేటి ఈనాటి చిట్టిపొట్టి బాలలం
రేపటి గట్టిపట్టు ఉన్న పౌరులం
మా భారతదేశం కాపలాదారులం
మేం సందేశం అందించే గూడచారులం !


కామెంట్‌లు