పరోపకార పరాయణత;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 మనిషికి అనేక కోరికలు ఉంటాయి  చిన్నతనంలోనే ప్రారంభమవుతుంది  ఆ తత్వం. అమ్మను నాన్న ముట్టుకుంటే ఇది నా సొంతం నువ్వు అంటుకోకూడదు అని దూరంగా తోసేయడం  బాలలతత్వం. అలాగే మనిషికి కామం అంటే కోరిక  ఎలాంటి కోరికలు ఉంటాయో చెప్పలేం  ఎప్పటికైనా ధనాన్ని సంపాదించాలని ఉండవచ్చు, జీవితంలో విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకోవచ్చు,  అందమైన స్త్రీలతో కాలం గడపాలని భావించవచ్చు  ఇలా ఆలోచించే వాళ్ళు తన స్థితిని గమనించరు తన చేతిలో రూక లేకపోతే  కోరికలు తీరవు కదా చేతిలో ఉన్న డబ్బు మితం కోరికలు అపరిమితం మరి అవి ఎలా తీరతాయి. అలా కోరికలు ఉన్నవాడు  ప్రకృతిపై దృష్టి పెట్టి  దానిని అధ్యయనం చేస్తూ కలాన్ని చేత పుచ్చుకొని  తాను ఏది గమనించాడో  దానిని వ్రాస్తూ ఉంటే వాడుకవి అవుతాడు. వ్రాయాలన్న కోరిక లేకపోతే  కలాన్ని ఎలా చేతపట్టగలడు  అలాగే రవి  ఈ ప్రపంచం సజీవంగా ఉంది అంటే కారణం సూర్య భగవానుడే అని  భారతీయుడు నమ్ముతాడు  అందుకే ఉదయమే  సూర్యునికి  నమస్కారం చేయడంతో అతని కార్యక్రమం ప్రారంభమవుతుంది  సాయంత్రం సూర్యాస్తమయంలో వారికి నమస్కారం చేయడంతో  ఆరోజు గడిచిపోతుంది  ఈ ప్రపంచం మొత్తానికి ఆయుష్షును ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ రవిని కోరుకోకపోతే  ఆ ప్రయత్నం చేయగలిగి ఉండేవాడా  చేస్తాడా  మనిషితో పోలుస్తున్నామని కాదు  కోరికలతో పోలుస్తున్నా పరోపకారాం చేయాలన్న కోరికలతో పోలుస్తూ సూర్యుడు వేడిని  చంద్రుడు చల్లటి వెన్నెలను మన కందిస్తూ  మన ఆయురారోగ్యాలను స్థిరంగా ఉంచుతున్నారు. కామము అంటే ప్రతి మనిషికితెలిసిన అర్థం  అందమైన స్త్రీని తాను  అనుభవించడం అనే. తల్లిదండ్రుల మీద ప్రేమ కోరిక కదా  బిడ్డల పైన ఉన్న మమకారం కోరిక కాదా బంధువుల పైన  స్నేహితుల పైన ఉన్న మమకారం  కోరిక కదా  ఇతరులకు సహకరించాలి సాయపడాలి అని అనుకోవడం  కోరికలో భాగం కదా  మనిషికి ముందు చెడు ఆలోచన తప్ప మంచి ఆలోచన రాదు అని మన పెద్దలు అనేకసార్లు చెబుతూ ఉంటారు  గాంధీ లాంటి వారు కూడా  చెడును గురించి ఆలోచించకు  దాని గురించి చెప్పకు అది చేయకు అని చెప్తున్నారు  ఆయన అనుసరించారు కూడా  అలా మంచిని ఆచరించాలి అన్న అభిప్రాయంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా  గొప్ప కవిగా తయారవుతాడు వేమన లాగా  ప్రకాశవంతమైన వెలుగుని  సమాజానికి  ప్రసరింపజేస్తాడు అని చెప్తున్నాడు వేమన.
మోక్షాన్ని పొందాలి అనుకోవడం కామం కదా  ఆ కోరిక లేకపోతే దానిని సాధించగలడా మనిషి.
ఆ పద్యాన్ని చదవండి.

"కామికానివాడు కవి కాదు
రవి కాదు 
కామిగాక మోక్షగామిగాడు  కామియైన వాడే కవియోను  రవియోను..."కామెంట్‌లు