నిడదవోలు పరిసర ప్రాంతాలలో ఉన్న నాటక కళను అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకొని పని చేసినవాడు జవ్వాది అని పిలువబడే జవ్వాది రామారావు. సొంత పని అత్యవసరమైనా సరే నాటకాల ప్రదర్శన ఆపినరోజు లేదు నేను విజయవాడ లో పనిచేస్తున్న సమయంలోనే నాతో పాటు రేడియోలో అనేక నాటకాలు వేసిన వాడు విశాఖపట్నం వెళ్ళిన తర్వాత సి వి సూర్య నారాయణ దర్శకత్వంలో నేను జవ్వాది కలిసి నటించిన నాటకాలు చాలా ఉన్నాయి. అతను పక్కన ఉంటే హాస్యానికి కొదువ ఉండదు. నాటకాలలో వాక్యాలని అటూ ఇటూ మార్చి అర్థ భేదంతో విపరీతంగా నవ్వించగలిగిన చతురుడు. పాలకొల్లులో ప్రతి సంవత్సరం నాటక పోటీలు జరుగుతుండేవి. నేను, నండూరి సుబ్బారావు గారు, కలపాల సూర్య ప్రకాశరావు గారు న్యాయనిర్ణేతలుగా వెళ్ళేవాళ్ళం నిడదవోలు నుంచి జవ్వాది రామారావు మంచి నటీనటులతో ప్రతి సంవత్సరం తన బృందంతో నాటకాన్ని తీసుకువచ్చే వాడు. ఒక సంవత్సరం మా దగ్గరికి వచ్చి నేను కొత్త నాటకం తయారు చేశాను ప్రదర్శన ఒకసారి చూసి మాకు సలహాలు ఇవ్వండి అంటే ప్రస్తుతం మేము న్యాయనిర్ణేతలుగా వచ్చాం. ఇప్పుడు నీ నాటకాన్ని చూసి సలహాలిస్తే రేపు నీ నాటకానికి బహుమతులు వస్తే చాలా చెడ్డ పేరు వస్తోంది మాకు కనుక మేము రాము అని ఖచ్చితంగా చెప్పారు సూర్యప్రకాశరావు గారు అంత నిక్కచ్చిగా ఉంటారు కనుకనే ప్రతి సంవత్సరం బహుమతుల ఎన్నికల్లో ఏ ఒక్కరు వేలుపెట్టి చూపించడానికి వీలులేకుండా మా నిర్ణయం ఉంటుంది.
ఏ ఏ నాటకం ప్రేక్షకులను ఆకర్షిస్తోందో ఎలాంటి నటులు ఆ వేషానికి సరిపోతారో అలా ఎన్నిక చేయడం అతని తరువాతనే. ఎక్కువమంది నిర్వాహకులు కథానాయిక విషయంలో ఎవరు తక్కువగా వస్తారు అని ఆలోచిస్తారు కానీ రామారావు ఎవరు ఆ వేషానికి సరిగ్గా సరిపోతారు అని ఆలోచిస్తాడు. నాకు, సి.వికి చాలా చక్కటి స్నేహితుడు మాతోపాటు చాలా నాటకాలు వేసినవాడు. దాసరి నారాయణ రావు గారు పాలకొల్లులో వున్నప్పుడు అతనితో పాటు ఎన్నో నాటకాల్లో వున్నాడు.
దాసరి సినిమాలలోకి వెళ్ళిన తర్వాత వారి సినిమాలలో కూడా పాత్రలు వేశాడు. చిన్నతనంలోనే అకాల మరణం పొందిన రామారావు జవ్వాది చిరస్మరణీయుడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి