వృద్ధాప్యం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 మానవ జీవితంలోని బాల్య  కౌమార యవ్వన దశలు దాటి ముసలితనం దాపరించినప్పుడు  తన జీవితంలో జరిగిన అనేక సంఘటనలను  జ్ఞాపకం చేసుకుంటూ  తనలో తానే  ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు.  కష్టము, నష్టము కలిగించిన విషయాలను గురించి ఆలోచించినప్పుడు ఏకాంతంగా దుఃఖంలో మునిగి మనసులో ఉన్న బాధను  మరిచిపోవడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకు ఈ మానవులకు ప్రేమ, అభిమానంతో ఎందుకు  దగ్గరకు తీసుకుంటారు. ఒక మనిషికి మరో మనిషికి ఏమిటి సంబంధం. రక్తసంబంధం కాని వారు కూడా ఈ బంధాలకు దూరం కావడానికి అవకాశం ఉంది. ఏదో ఒక సందర్భంలో  వారు స్నేహితుడిగానూ, మిత్రుడు గానూ మారడం  ఆ అనుబంధం జీవితాంతం ఉంటుందని భ్రమ పడడం  అది మధ్యలోనే తెగిపోవడం  ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎవరినైనా పెద్దవాడిని కలిసి  ఏకాంతంగా బాధపడుతున్నావు కదా  జీవితంలో తోడు లేకుండా జీవించడం కష్టం వివాహం చేసుకుంటే భార్య వస్తుంది  ఆమెతో  కాలక్షేపం చేస్తూ  శేష జీవితాన్ని గడిపేయవచ్చు కదా అని ఎవరైనా అంటే నాకూ అలాగే అనిపిస్తుంది అయ్యా  ఎవరినైనా మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను కానీ ఈ వయసులో ఏ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంది చెప్పు  నాకు నా బాధ కన్నా ఇలాంటివే నన్ను ఎక్కువగా ఇబ్బంది పెడుతూ వుంటాయి అంటూ వాపోతాడు తప్ప  నాకు పెళ్లి అయినా ఈ వయసులో ఏం సుఖం అని ఏ పరిస్థితిలోనూ అనడు అది ఆ వయసు లక్షణం. తన  వైవాహిక జీవితాన్ని  ఒక మధురానుభూతిగా మిగల్చుకుంటాడే తప్ప  బాధను మాత్రం మర్చిపోలేడు. ఆ వయసులో ఏం జరుగుతుంది  ప్రతి అవయవం  చచ్చుబడిపోయి తన అధీనంలో లేకుండా పోతుంది  నడవాలంటే కర్రను అసరా చేసుకోవాలి  ఏదైనా పని చేయాలనుకుంటే ప్రక్క వారి సహకారం కావాలి  భోజనం చేయడానికి కూడా పాపం దంతాలు లేక నవల లేక మెత్తగా అన్నం తయారు చేసి  నిదానంగా తినడానికి అలవాటు పడిపోయాడు. తన శరీరం ఏ పనులు చేయడానికి  కూడా సహకరించని స్థితి దాపరించింది అని తాను బాధపడడు. మోహము అనేది  ఏ వయసులో ఉన్న వారి కైనా తప్పదు. దాని నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు  దానిమీద చింత  తాను ఏది అనుభవించలేక పోతున్నాడో దానికోసం ఎంత తపన పడతాడో అతనికి తెలుసు ఎన్ని పడినా  ఆ మాయాజాలం నుంచి తప్పించుకోలేడు మనిషి అని వేమన చెప్పడం కోసం  ఈ పద్యాన్ని మనకు అందించారు  ఆ మధుర తత్వం తెలియాలంటే ఈ ఆటవెలది చదవండి.
"అంగమెల్ల వడలి అటు దంతములు నూడి  
తనువు ముదిమి చేత తరచు పడక 
ముప్పు తిప్పల బడి  మోహంబు వదలదు"కామెంట్‌లు