అజ్ఞానం- మూర్ఖత్వం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 మానవ ప్రకృతి ఒక్కో తరానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది  మొదటి తరంలో ఉన్న నిజాయితీ రెండవ తరంలో రెండవ తరంలో నిజాయితీ మూడో తరంలో తగ్గుకుంటూ వస్తాయి  అది వివేకం క్షీణించడం వల్ల, కాలం మారడం వల్ల స్వార్థాలు పెరిగి ఇలాంటివి జరగవచ్చు  శంకరాచార్యుల వారు ప్రపంచానికే ఆధ్యాత్మిక బోధ చేసిన గురువు అందుకే జగద్గురువు అనే పేరు సార్ధకం. తర్వాత రమణ మహర్షి ఆ సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకొని  సమాజంలో వివేకాన్ని పెంచడం కోసం వారి జీవితకాలం మొత్తం కృషి చేశారు  నిస్వార్థంగా వారు  ఉన్నారు కనుక వారు మరణించిన తర్వాత కూడా వారి గురించి మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది  స్వార్థపరుల గురించి ఎవరు ముచ్చటించుకుంటారు.
ఆయుర్వేద శాస్త్రంలో ఒక వాక్యం ఉంది మనం ఏ పదార్థాన్ని తింటామో అది జీర్ణం అయిన తర్వాత దాని ప్రభావం శరీరం మీద  ఉంటుంది అని ఉదాహరణకి వంకాయ కూర ఉంది అది అందరికీ పడకపోవచ్చు  కొంతమందికి దురద వస్తుంది అది తింటే. కనుక దానిని మానివేయడం సహజం  అలాగే ఈరోజు విద్యా వ్యవస్థ తీసుకుంటే  నీకున్న విజ్ఞానాన్ని గుర్తించి వారు ఎన్నిక చేయడం లేదు ఎవరు ఎక్కువ డొనేషన్ ఇవ్వగలిగితే  వారిని మాత్రమే తీసుకుంటున్నారు. తనను తాను తెలుసుకున్న వాడు యోగి, రుషి అని ఆనాడు చెప్పుకున్నాం. ఇవాళ పేటలో వస్తున్న కొంతమంది దొంగ సాధువులు ఎలా ఉన్నారు  పాత గురువుల పేర్లు చెప్పుకొని  వీరి ఆటలను కొనసాగిస్తున్నారు. ఈ మధ్య ఒక మహర్షి  ఆయుర్వేదంలో చెప్పిన ఉదాహరణ ఇచ్చి మాంసాహారులను గురించి చెబుతూ  మేక మాంసం తిన్నవారు చలాకీగా ఉంటారని  గొర్రె మాంసం తిన్నవాళ్ళు ఆలోచన లేకుండా ఉంటారని  పంది మాంసం తిన్నవారు పంది లాగా, కోడి మాంసం తిన్నవారు కోడి లాగా ప్రవర్తిస్తారని  వేదిక పైన చెప్పడం  అది జ్ఞానమా, అజ్ఞానమా  ఇవాళ పంది మాంసం తింటున్న  వ్యక్తులకు  మేహ వ్యాధులు రావు గాడిద మాంసం తినేవాడికి  దాని పాలు తాగే వాళ్ళకి చక్కటి ఆరోగ్యం సమకూరుతుంది  గాడిద మాంసం వల్ల ఎన్నో రుగ్మతలు రూపుమాసిపోతాయి. ప్రపంచంలో కుష్టు వ్యాధికి మందేలేదు అనుకున్న ఈ రోజున  గాడిద మూత్రాన్ని  పేడను సమపాళ్లలో తీసుకొని  వస్త్రకలితం చేసి  బాగా మరిగించి సగం మరిగిన  తర్వాత అది 40 రోజులు వాడి అంటే మండల దీక్షకు  కుష్టు వ్యాధి వచ్చిన వ్యక్తికి అక్కడ వచ్చింది అన్న ఆనవాళ్లు కూడా లేకుండా పోతాయి. ఈ అసలు విషయాలు తెలియకుండా ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడితే  మేధావి వర్గం సహిస్తోందా? పోనీ వాడు చెప్పినట్లుగా ఈ ప్రపంచం మొత్తం  మాంసాహారాన్ని భుజించడం మానివేస్తారా?  అతని అమాయకత్వం కాకపోతే  అలాంటి వారికి గౌరవ మర్యాదలు ఎక్కడ నుంచి వస్తాయి.కామెంట్‌లు