క్వీన్ ఎలిజ‌బెత్ దీర్ఘాయువుకు రహస్యాలు ?; - సి.హెచ్.ప్రతాప్ ( చరవాణి: 95508 51075 )
 న‌ల‌భైల్లో ప‌డ‌గానే వ‌య‌సైపోయింద‌ని దిగాలుప‌డేవారికి క‌నువిప్పుగా సెంచ‌రీ(100)కి చేరువైనా సెల‌యేరులా ఉర‌క‌లెత్తే ఉత్సాహంతో అంద‌రిలో స్ఫూర్తి నింపే వారూ మ‌న చుట్టూ కనిపిస్తుంటారు. ఆరోగ్యక‌ర‌మైన ఆహారం, వ్యాయామం దీర్ఘాయువు ర‌హ‌స్య‌మ‌ని మ‌రికొంద‌రు చెబుతుంటారు. ఇక బ్రిట‌న్ రాణి క్వీన్ ఎలిజ‌బెత్ టూ (95) అత్య‌ధిక వ‌య‌సు క‌లిగిన జీవించి ఉన్న మ‌హారాణిగా గుర్తింపు పొందారు.
1926, ఏప్రిల్ 21న జ‌న్మించిన క్వీన్ త‌న తండ్రి మ‌ర‌ణంతో పాతికేండ్ల వ‌య‌సులోనే పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టారు. ఆమె దీర్ఘాయువు వెనుక ఉన్న ఐదు రహ‌స్యాలు :


1. ఎక్కువ‌కాలం ఆరోగ్యంగా జీవించాలంటే అద్భుత‌మైన ఫిట్‌నెస్ మెయింటైన్ చేయాల‌ని చెప్పే వాద‌న‌కు భిన్నంగా క్వీన్ ఎలిజ‌బెత్ వేగంగా న‌డ‌వ‌డం వంటి సెన్సిబుల్ ఎక్స‌ర్‌సైజ్‌ చేస్తుంటారు.
2. రెండో ప్ర‌పంచ యుద్ధం జ‌రుగుతున్న స‌మ‌యంలో టీనేజ‌ర్‌గా ఉన్న క్వీన్ అప్ప‌టి త‌న త‌రం వారంద‌రిలాగే సింపుల్ మీల్స్ తీసుకునేందుకు మొగ్గుచూపేవారు. సాధారణ భోజనం దీర్ఘాయువును పెంపొందిస్తుందన్నది ఆమె ప్రగాఢ విశ్వాసం.
3. క్వీన్ ఎలిజ‌బెత్ అరుదుగా మేక‌ప్ వేసుకుంటారు. ఎండ‌లో తిరిగేందుకు ఇష్ట‌ప‌డని క్వీన్ ఖ‌రీదైన కాస్మెటిక్ బ్రాండ్స్‌నే వాడాల‌ని కోరుకోరు. రోజ్ మిల్క్ మాయిశ్చ‌రైజ‌ర్‌ను వాడుతుంటారు.
4.  వ‌య‌సు మీద‌ప‌డినా క్వీన్ చ‌లాకీగా, ఆరోగ్యంగా ఉండ‌టానికి ఆమె మాన‌సిక ఆరోగ్యం కుదురుగా ఉండ‌ట‌మేన‌ని కొలోవ్‌స్కీ చెబుతారు. ఆమె ప్రతిరోజూ ఉద‌యం వార్తాప‌త్రిక‌లు చ‌దువుతూ సామాజిక రాజ‌కీయ ప‌రిణామాల‌ను క్షుణ్ణంగా తెలుసుకోవ‌డంతో పాటు మెద‌డును చురుకుగా ఉంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. గ్లాసు స‌గం నిండుగా ఉంద‌నే ఆమె సానుకూల దృక్ప‌ధం కూడా ప్ర‌తిఒక్క‌రూ అల‌వ‌ర‌చుకోవాల‌ని నిపుణులు చెబుతుంటారు.
5.ఔన్న‌త్యంతో కూడిన సంస్కృతి నేప‌ధ్యంతో ఎదిగిన క్వీన్ ఎలిజ‌బెత్ భావోద్వేగాల నియంత్ర‌ణ‌, స‌మ‌న్వ‌యం సాధించ‌డంలో నైపుణ్యం సాధించార‌ని అంటారు. మాన‌సికంగా ధృడంగా ఉండే రాణి సైకాల‌జిస్టులు బెనిఫిట్ ఫైండిగ్‌గా పిలిచే ప్ర‌క్రియ‌ను ప్రాక్టీస్ చేస్తార‌ని చెబుతారు.

కామెంట్‌లు