నోటి దురద మాటలు; -శంకరప్రియ., శీల.,--సంచారవాణి: 99127 67098
 👌నోటి దురద మాటలు
తలబొప్పి కడతాయి!
      ఆలు మగలకు నైన!
ఆత్మ బంధువులార!
👌ఎంత వారల కైన
చేదు అనుభవ మొసగు!
     నోటి దురుసు మాటలు!
ఆత్న బంధువులార!
            (ఆత్మ బంధు పదాలు. శంకరప్రియ., )
👌"మాటకు మాట తెగులు! నీటికి నాచు తెగులు!" అని, ఆర్యోక్తి! కనుక, మనము పలికే పలుకులు.. ప్రియముగా నుండాలి! గాని, కఠినముగా నుండకూడదు! పిన్నలైనా, పెద్దలైనా.. మాటల సందర్భములో ఆచితూచి, తక్కువగా మాట్లాడాలి!
👌ఒక ఇంటి యాజమాని.. కవిగారు! తన అర్ధాంగిని పిలిచి; "ఈ రోజు కూర ఏమిటి?" అని, అడుగగా; "కంద కూర" అని చెప్పింది! దానికా కవిగారు, ప్రాస కుదురు తుందని; "నీ బొంద కూర" అని, పలికాడు! అంతే.. శ్రీమతికి కోపం వచ్చింది! ఆ కోపావేశములో.. ఏమి చేసిందో తెలియదు గాని; శ్రీవారి తలకు మాత్రం బొప్పికట్టింది! చేతికి కట్టుకట్టారు!
👌ఆలు మగలకు, అన్న దమ్ములకు.. ఏ సమయమందు నైనా మాటలు.. తూటాలు కాకూడదు! తేనెలొలుకు పలుకులుగా నుండాలి! తస్మాత్ జాగ్రత్త!
     🚩తేటగీతి🚩
       👌"నేటి కూర యేమి"టనుచు నే నడుగగ,
           "కంద" యనగ సతి, కవిని గాన, ప్రాస
            కుదిరెనని యన "నీ బొంద కూర", యపుడు
             బొప్పి కట్టెనా తలపైన పొలతి వలన!
          ( నా శ్రీమతి చాల మంచి దండోయ్!  )
( అనుసృజన: "సాహితీ బంధు" తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ.,)

కామెంట్‌లు
చాలా చక్కగా నుడివిరి, మాట వలన కలుగే దుష్ప్రభావము గురించి.
చాలా చక్కగా నుడివిరి, మాట వలన కలుగే దుష్ప్రభావము గురించి.
"కందయె" తెచ్చిరి మరి నీ
బొందా యని సరస మాడ బొందిన ఫలమే
ఇందా యని ఒకటిస్తిని
ముందే జాగ్రత్త పడరు ముంచును మాటల్!!