అష్ట మూర్తీ శివుడు శంకరప్రియ., శీల.,సంచారవాణి: 99127 67098
🙏అష్ట మూర్తివి నీవె!
విభూతి ధరుడ వీవె!
     లింగోద్భవా! భవా!
శ్రీసాంబ! సదాశివ!
  (సాంబశివ పదాలు., శంకరప్రియ.,)
👌సాంబ సదాశివుడు.. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము,  సూర్యుడు, చంద్రుడు, జీవుడు.. యనెడు, ఎనిమిది రూపములలో.. విరాజిల్లు చున్నాడు. కనుక, "అష్టమూర్తి"గా వ్యవహరింపబడు చున్నాడు!
👌పరమేశ్వరుడు.. ఐశ్వర్యయుక్తము లైన, కాంతియుక్తము లైన.. దివ్యలీలా విభూతులందు ప్రకాశించు చున్నాడు. కనుక, "విభూతి ధరుడు".. మహా లింగోద్భవుడు, సాంబ సదాశివుడు!
🚩ఉత్సహ ఛందస్సు:
         శివుడె భూమి, శివుడె జలము,  శివుడె అగ్ని తేజమున్,
         శివుడె గాలి, శివుడె నింగి,  శివుడె విశ్వ రూపమున్;
         శివుడె రవియు, శివుడె శశియు,  శివుడె జీవ రూపుడున్,
         శివుడె నిండి యుండె జగతి,  శివుడె అష్ట మూర్తియౌ!
   (అష్ట మూర్తి వైభవం.,  శంకర ప్రియ., )

కామెంట్‌లు