ఆ పయనానికి వందనం.!; - ది పెన్.
పచ్చని పొలాల మట్టిలో సాగెను రైతు పయనం
ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతకు వందనం

పరిశ్రమల్లో యంత్రాలతో సాగెను కార్మికుని పయనం
వాడే ప్రతి వస్తువునూ అందించే శ్రామికునికి వందనం

తరగతి గదిలో పుస్తకాలతో సాగెను గురువు పయనం
పిల్లలకు జ్ఞానాన్ని బోధించే ఉపాధ్యాయులకు వందనం

సమాజంలోని చెడుతోనే సాగెను పోలీసుల పయనం
నేరస్థుల నుంచి ప్రజలను రక్షించే ఖాకీలకు వందనం

ఆసుపత్రిలో రోగుల‌ మధ్య సాగెను వైద్యుల పయనం
ఎందరో ప్రాణాలను కాపాడే ప్రత్యక్ష దైవాలకు వందనం

కోర్టులో కేసులు..సెక్షన్లతో సాగెను లాయర్ల‌ పయనం
బాధితులకు అండయ్యే న్యాయవాదులకు వందనం

కార్యాలయాల్లో ఫైళ్లతో సాగెను అధికారుల‌‌ పయనం
సమస్యల‌ పరిష్కారం, అభివృద్ధి చేసేవారికి వందనం

చట్టసభల్లో చర్చల నడుమ సాగెను నేతల పయనం
ప్రజలకు సంక్షేమ పాలనందించే పాలకులకు వందనం

బతుకు నిత్యసమరమై సాగెను సామాన్యుల పయనం
కుటుంబమే లోకంగా త్యాగాలు చేసే వారికి వందనం.!

కామెంట్‌లు
THE PEN చెప్పారు…
మొలక.. నిర్వాహకులకు కృతజ్ఞతలు.