ఈగలు బాలగేయం);---గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు
అమ్మ బెల్లం తెచ్చింది
మెత్తగ దాన్ని దంచింది
పిల్లలకంతా పంచింది
కాస్త నేలపై పడింది

ఈగలు వచ్చి వాలాయి
ఒకటే గోల చేశాయి
అమ్మ వాటిని తోలింది
శుభ్రం చేసి పెట్టింది

ఈగలు వెళ్లి పోయాయి
మరో చోటుకు చేరాయి
అశుభ్రమంటే ఇష్టము
శుభ్రతకు బహు దూరము

మురికిలో నుండు ఈగలు
వాటి వలన రుగ్మతలు
పాటించాలి శుభ్రత
అదే కదా ప్రాముఖ్యత

.

కామెంట్‌లు