సుప్రభాత కవిత ; -బృంద
అల నీలి గగనాన 
తెలి పాలమబ్బు
జలధారలతో
అభిషేకం చేయదలచేనేమో!

ఇలవంక దిగివచ్చు
తొలి వెలుగు కిరణం
అంతర్యామికి
నీరాజనం  అర్పించదలచెనేమో!

సనకాది మునులందరూ
తరువేషధారులై
నిగమ మంత్రాలు వల్లించుచున్నారేమో!

లింగరూపమున నిలుచున్న
గిరి శిఖరమొకటి
కైలాసగిరి  పోలిక
కనపడెనేమో!

గిరిలోన తరులోన
నీలోన నాలోన
అవని అణువణువునా
నిండిన చైతన్యదీపిక

అన్నిటా తానైన
అందరికి తండ్రైన
శివుడి అనుగ్రహమే కానీ
మరియొకటి కాదుగా!

మనలోన మన ముందు
మన చుట్టూ మనపైన
అచ్చముగ శివుడుండ
అనిపించదెందుకో!

ఉదయాన వెలుగులిచ్చి
జగతినంత రక్షించు
ఇనబింబములోని
శివుని  కరుణకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు