ఆచార్య జక్కంపూడి చర్మచక్షవులు లేకపోయినా జ్ఞాన చక్షువులతో లౌకిక జగత్తు లోని అలౌకికత్వాన్ని దర్శించగల మహనీయులు. వారి దృష్టి లోపాన్నే అద్భుత శక్తిగా మార్చుకొని తెలుగు సాహిత్యం లోని అనేక ప్రక్రియలలో తనదైన ముద్ర వేసుకొన్నారు. అనన్యాసామాన్యమైన ధారణాశక్తి వీరి సొంతం. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో ఆచార్య స్థానాన్ని అలంకరించి బోధన, పరిశోధన రంగాలను సమర్ధవంతంగా నిర్వహించారు. మాధుర్యం నిండిన గళం వీరి సొంతం. వీరు తెలుగు, తమిళ భాషలలో ప్రావీణ్యం గలవారు.
ఆచార్య జక్కంపూడి వారు అనేక అష్టావధానాలలో పృచ్ఛకులుగా పాల్గొన్నారు.వీరు చిన్ననాటి నుంచే చదువుపై అమితాశక్తి చూపేవారు. తండ్రి వేసిన విద్యా బిందువును జ్ఞాన సింధువుగా మార్చుకొన్నారు. వీరి పద్యాలు మొదట 1963 వ సంవత్సరం లో "వేదాంతభేరి" లో "గీతామాత " అనే శీర్షికన ప్రచురించబడ్డాయి.
వీరి తొలికథ "చెరిగిన కల" "కొత్తచీర" అనే కథల సంపుటిలో ప్రకటించబడింది. ఇంతే కాకుండా వీరు విమర్శనా రంగంలో అనేక రచనలు చేసి వివిధ సదస్సులలో పత్రాలు సమర్పించారు. ఆచార్య జక్కంపూడి తమిళంశాఖ లో కూడా అనువాదకులుగా పనిచేసారు. వీరు అనేక శతకాలు వెలయించారు. "చంద్రమౌళి శతకం,
నటరాజ శతకం, సఖ శతకం, మారుతీ శతకం " మొదలైనవి. ఇంతే కాక చాటువులు, వచనరచనలు, పద్యకృతులు, గేయాలు, కథలు ఇలా చెప్పుకుంటూ పోతే వీరి కలం నుంచి ఎన్నో రచనలు వచ్చాయి, ఇంకా వస్తూ ఉన్నాయి. వీరిని ఎన్నో పురస్కారాలు వరించాయి. ఆచార్య జక్కంపూడి మునిరత్నంగారు ఇంకా ఎన్నో అద్భుతం రచనలు చేసి తమ జ్ఞానామృతాన్ని సాహితీ పిపాసకులకు పంచాలని ఆశిద్దాం.
ఆచార్య జక్కంపూడి జీవిత విశేషాల విహాంగవీక్షణం;- ఎన్. ఎస్. ఎల్.కళ్యాణి శిష్టా.- ఏం. ఏ తెలుగు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి