కార్తీక పౌర్ణమి* అద్వైత భావన ;-ఎం. వి. ఉమాదేవి
తులలేని కార్తికమాసం 
తులసీ కళ్యాణం 
తుమ్మి పూలతో 
తుష్టి చెందే హరుడు 
శంఖుపూల సౌందర్యం 
నాగమల్లి పుష్ప నివేదన !

నదీతీరాల్లో 
మూగే భక్తజన సందోహం 
ఉసిరి చెట్టుకింద దీపారాధన 
వనభోజనాలు కార్తికo లో 
సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు!
హరిహరుల తేడాలేని 
అద్వైతభావన !

కేదారేశ్వర వ్రతం కమనీయము 
భగవంతునికి భక్తునికి
అనుసంధానంగా వెలిగే 
కార్తీక దీపం
ఉభయ సంధ్యల్లో 
ఉత్తేజమిస్తుంది !
ఉపవాసం ఆరోగ్యకరం !!


కామెంట్‌లు