* అది... నీ అదృష్టమే...!*@ కోరాడ నరసింహా రావు !
నాకు  తెలుసు..... !
  సత్యాన్ని తెలుసుకుని... 
   నడచుకోవాలనుకునే... 
   నీ జిజ్ఞాస కు... 
 ఈ పొంతనలేని ప్రవర్తనలు 
 తికమక పెడుతున్నాయని !
నిన్ను  ఎటూ....     తేల్చుకోనివ్వటం లేదని... !!

ఔను.... వారు చెప్పింది... 
  చేయకపోవచ్చు !
 చేసింది... చెప్పక... 
  మరుగుపరచనూ వచ్చు !
   అది... వారిబలహీనత !!

వారిబలహీనతలతో... 
  మనకు పనేముంది... !
 మనకు కావలసింది వారి 
  బలహీనతలు కాదు..., 
  వారు వెల్లడించిన... 
   అనుభవ సత్యాలే... !!

అది ఎవరు చెప్పినా.... 
  సత్యము, సత్యమే కదా !
   ఆచరణ యోగ్యమే కదా... 
   అనుసరణీయమే కదా... !!
  వారు చెప్పారని... సత్యం 
   అసత్యమైపోదుగా... !

సత్యాన్ని చెప్పి... 
  ఆచరించకపోవటం... 
   అది వారిఁదౌర్భాగ్యం !
 విని ఎట్టి సంశయము లేక... 
 అరమరికలకు తావీయక... 
   ఆచరించగలిగితే...., 
.. అది  నీ అదృష్టమే... !!
. ..... ******

కామెంట్‌లు