సరస్వతీదేవి ;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అన్ని చదువులకు
ఆదివీ నీవమ్మ
పలుకుల రాణీ మమ్ము 
దయ జాడవమ్మా
సర్వవిద్యలు మాకు
అభివృద్ది జేసీ
దయతోడ మమ్మెపుడు 
దీవించుమమ్మా
చిరునవ్వు చిందించు 
నీమోము జూడగా
మధుర రచనల శక్తి
మాకొచ్చు నమ్మా
మల్లెలు మొల్లలు 
పొగడలు తెచ్చి
నీపాదాల కర్పించి
మొక్కుదు మమ్మా !!

కామెంట్‌లు