ఓటుకు... నోటా.....,
నోటుకు... ఓటా.... !?
నాలుగు వేలొకలిస్తే....
ఐదు వేలు ఇంకొకలు... !
ఎలాగూ......గెలవలేమనుకున్న వాళ్ళు దండగ ఖర్చనుకుని...
ముందే జాగ్రత్త పడ్డారు... !
వాళ్లేనా తెలివైన వాళ్ళు... !
ఓటరేనా , తెలివితక్కువ వెధవ
అటూ - ఇటూ... అందినంతా..
అందుకుని...ఎవరికి వెయ్యాలో
వాళ్ళకే వేసి ఎవరికి చెప్పాల్సి నబుద్దిని వాళ్లకు బాగానే చెప్ప గలరు ... !
ఎవరి స్వార్ధం వారు చూసు కుంటుంటే...,ఓటరు మాత్రం వారి స్వార్ధం, వారు చూసుకో లేరా....!, ఓటర్లేనా తెలివితక్కు వవాళ్ళు.... !!
తమతీర్పులతో...చూపుడువేలు ఖబడ్డారు లెన్ని మార్లు చెబుతున్నా... నోటు, మందు, ముక్కలతో... ఓటర్లను కొనే యాలనుకోవటం వాళ్ళ వెఱ్ఱితనమే కదూ.... !!
ఓటరు కేవలం ఈ తాత్కాలిక ప్రలోబాలకే లోబడిపోయారను కుంటున్నారా.... కాదు... !
పూర్తిగా పొదుగులో నుండి పాలు వస్తున్నంతవరకూ...
ఆ ఆవును వదులుకోరు... !
అది వట్టిపోయింది.., ఇంక దానినుండి యే ప్రయోజనం ఉండదు అనుకుంటే...,
అయ్యో పాపం ఇన్నాల్లూ...
మనకెంతో ఉపకరించిందే...
అనే కనీస కృతజ్ఞత, దయ...
లేకుండా... కబేళాకు పంపించేస్తారు... !
ఆ విషయం... వీళ్లకు మాత్రం తెలీదనా... సాగినంతకాలం సాగనీ... అంతవరకూ మనమేగా చక్రవర్తులం అనితెగింపు వీళ్లది....... !
ఇదంతా... అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్.... !!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి