ఊర మిరపకాయలు ;-ఎం. వి. ఉమాదేవి.
ఆట వెలదులు 
=========== 
పచ్చిమిర్చి దెచ్చి పరిశుద్ధమును జేసి  
చల్లలోన నుప్పు చారెడేసి 
మిర్చిచీరి వేసి మిగులనూరిన నాడు 
నెండలోనబెట్ట మెండుగాను  !!

ఉప్పు మిర్చితోడ నుల్లమ్ము రంజిల్లు 
జిహ్వ లేచివచ్చు జీవునకును 
పప్పుచారులోన నుప్పుమిర్చియునుండ
నేయివోసి తినగనెంత రుచియు!!

కామెంట్‌లు