తలరాత మారు! ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
ఎక్కడో పుట్టింది ఏరు
అందరూ స్వాగతం పలికారు
దండిగా పారింది నీరు
నీరుంటె సంతోషించుతారు

హద్దులో ఉండాలి నోరు
చేయొద్దు ఎవరితో పోరు
అట్లుంటె నవ్వులనది పారు
పెద్దలందరు ఇదే చెప్పినారు

చేను పండిందండి జోరు
కష్టాలన్ని కలలోకి జారు
జనమంత నవ్వితే హోరు
వస్తుంది అందరికి పేరు

ఊరంత శాంతిని గోరు
ఇట్లుంటె కష్టాలు తీరు
కలిసిమెలిసుంటే మీరు
అందరి తలరాత మారు!!
*********************************


కామెంట్‌లు