ఆఖరి క్షణం వరకు!(కవిత);-కొత్తపల్లి ఉదయబాబు-సికింద్రాబాద్.
కళ్ళు తెరిచినప్పటి నుంచి
బ్రతుకు పోరాటం మొదటి యుద్ధం
ఆకలి తీరాక అక్కున చేర్చుకునే 
వ్యక్తి కోసం మరోసమరం.
జ్ఞానవిజ్ఞాన సమూపార్జనలో
రాంకుల సమరం!
బ్రతుకు తెరువు సమరంలో 
పరీక్షల యజ్ఞపు ఉద్యోగప
ఫలం లభించాక కష్టాసుఖాలు పంచుకునే
తోడు వేటలో జీవితాల చిలుకు సమరం.
అందులో బయటపడ్డ వెన్నముద్దల
పిల్లల భవిష్యత్తు పునాదికి
బతుకు అంకిత సమరం.
బాధ్యతల సమరాలన్ని తీరాక
జీవనతీరం చేరే చివరి క్షణం
"ఎక్కడిదాక?"అన్న ప్రశ్నకు
జవాబయ్యే వరకు ఈ చక్రభ్రమణం!
కామెంట్‌లు