మాజిక్!;-అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు మాజిక్ మామ బడికి రావటంతో అంతా కోలాహలంగా ఉంది. రకరకాల మాజిక్స్ తో పిల్లలను ఆకట్టుకున్నాడు.ఓఖాళీ గొట్టంలో తనకుడి ఎడమచేతులు పెట్టి  ఏముంది అని  అడిగాడు. గొట్టం అంతా ఖాళీ అని పిల్లలు చెప్పారు. ఓఇద్దరు ముగ్గురు పిల్లల చేతులు గొట్టంలో పెట్టి ఏమీలేదు అని చెప్పాడు.పొడవాటి తనకోటు రెండు  చేతుల అడుగున  ఏవో ముందే పెట్టాడు.కానీ చేతి అంచుమడతలు కన్పడనీయకుండా మూసిఉంచాయి.ఇప్పుడు కుడిచేతిని గొట్టంలో పెట్టి అబ్రకదబ్ర అంటూ పిల్లలతో కబుర్లు చెప్తూ కుడికోటు చేతి మడత లోంచి  ఓ ఆకుపచ్చ దస్తీని బైటకి గొట్టంలోంచి లాగుతున్నడు."పిల్లలూ!రైలు నడవాలంటే ఏజెండా ఊపాలి?" "ఆకుపచ్చ జెండా!" ఆ..వస్తోంది ఆకుపచ్చ దస్తీ!పిల్లలు చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఖాళీ గొట్టంలోకి ఎడంచేతిని పంపి "రైలు  ఆగాలి అంటే?" ఎర్రజెండా! అంతే నోటి తో విజిల్ ఊదుతూ చాకచక్యంగా ఎడం కోటు చేతి కింద మడత లోంచి ఎర్ర దస్తీ ని గొట్టం లోంచి లాగుతున్నాడు.ఆఖరుగా పిల్లలకు ఇలా చెప్పాడు"ఇందులో మాయమంత్రాలు చేతబడి విరుగుడు లేదు. మనచేతివేళ్లు చురుగ్గా పనిచేయాలి.దూరంగా జనాలు ఉండాలి. పొడవాటి కోటు వేసుకుని దాని అంచు చివర్లలో ఈరెండుదస్తీలు మడతలో దాచి కబుర్లతో కాలక్షేపం చేస్తూ  ఈమాజిక్ చేయాలి. "అంతే పిల్లలకు ట్రిక్ తెలిసిపోయి సరదాగా  ఆడుకున్నారు🌹
కామెంట్‌లు