వడిశల (బాల గేయం);-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
వన్నెల చిన్నోడొచ్చాడు
వడిశల చేత పట్టాడు
మంచె మీదికి ఎక్కాడు
అటు ఇటు చూశాడు

జోలలో రాయి తీశాడు
వడిశల నందు పెట్టాడు
గిరగిర వడిశల తిప్పాడు
మక్కచేనులోకి విసిరాడు

చేనులో ఉన్న పిట్టలన్ని
రెపరెప మని లేచాయి 
చెట్టు మీద వాలాయి 
అవి గోల గోల చేసాయి

కూలీలు అందరు వచ్చారు
మక్క చేనంతా కోసారు
పిట్టలు వచ్చి చూసాయి
అడవికి పారిపోయాయి


కామెంట్‌లు