సకారాత్మకం!అచ్యుతుని రాజ్యశ్రీ

 నెగిటివ్ నకారాత్మక భావాలు మనలో నిరాశ చిరాకు తెప్పించి ఏపనీ చేయలేము.కోపంతో అందరిపై ధాంధూం అని  ఎగిరి అందరికీ చెడ్డవారిగా మారుతాం.ఎప్పుడూ పాజిటివ్ సకారాత్మక భావాలతో ఉండాలి.మన పెద్దలు కూడా శుభం పలకరా మంకెన్నా అనేవారు. తధాస్తు దేవతలున్నారు అని చెప్తారు. చెడు లో మంచిని చూడు అనేదే దీని అర్థం. ఇద్దరు మిత్రులు చెట్టుకింద నించుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంతలో ఓకాకి శివా పై రెట్ట వేసింది. అది అతని తలపై బట్టలపై పడింది. చిరాగ్గా శివా అరిచాడు "ఛీ పాడుకాకి!నాతల చొక్కాని ఖరాబు చేసింది ". హరి నవ్వుతూ అన్నాడు "ఒరేయ్!ఎందుకు అంత గావుకేకలేస్తావు? అది కాకి రెట్ట!కాగితం ఆకుతో తుడిస్తే పోతుంది. అదే ఏగేదె పేడ నెత్తిన పడింది అనుకో అప్పుడు బాధ పడాలి.చూడక రోడ్డు పై పేడలో కాలేస్తే జర్రున జారే ప్రమాదం ఉంది. నోరులేని ఆకాకిని తిట్టడం ఎందుకు?నీనోట్లో రెట్ట వేయనందుకు సంతోషించు."అంతే శివా నోరు మూతబడింది🌷
కామెంట్‌లు