గర్వం! అచ్యుతుని రాజ్యశ్రీ

మనభౌతిక శరీరం అందచందాలని చూసి గర్వ పడరాదు.దివ్యాంగులని అందవిహీనంగా ఉన్న వారిని  చిన్న చూపు చూడటం తప్పు. ఆఊరిలో అతనో పెద్ద గూండా! అందరిపై దాదాగిరీ చేస్తూ పిల్లల్న ముసలివారిని సతాయించేవాడు.ఓరోజు ఊటుగా తాగివచ్చి వాడి శిధిలావస్థలో ఉన్న ఇంట్లో పడుకున్నాడు.పెద్ద కుంభవృష్టి వర్షానికి పైకప్పు అమాంతం కూలి వాడి మీద పడింది. వాడికాళ్లు నుజ్జు నుజ్జు ఐనాయి.కాపాడండీ అని పెద్దగా కేకలు వేయసాగాడు.ఒక్కరూ ఆవైపు తొంగి చూడలేదు.తెల్లారింది.వర్షం తగ్గింది.వాడి మూలుగు కేకలు వినపడి తొంగిచూసి బాగా శాస్తి జరిగింది అని అంతా ఆనందించారు. కానీ ఆఊరి ఆయుర్వేద వైద్యుడు పరోపకారార్ధం ఇదంశరీరం అని లోపలికి వచ్చి శిధిలాలను తొలగించి చికిత్స చేస్తుంటే ఊరివారు అన్నారు "అందరినీ సతాయించే ఈదుర్మార్గుడిని అలా వదిలేయండి అయ్యా!"
అప్పుడు ఆయన ఇలా చెప్పారు " ఓగున్న ఏనుగు పొగరుగా చీమల పుట్టలు తొక్కేది.పక్షి గూళ్లను కెలికేది.ఒకరోజు  ఓగుహలో దూరింది.దానిమెడ గుహద్వారం దగ్గర ఇరుక్కుపోయింది. ఇక పెద్దగా ఘీంకరిస్తుంటే ఓఏనుగుల గుంపు వచ్చి దాన్ని పట్టుకుని బైటకి లాగాయి.నోరు లేని ప్రాణులకే అంత దయ!తమ జాతి గున్న ని కాపాడాయి.ఈగూండా పాపాలు చేశాడు.మనల్ని సతాయించాడు.ఆదేవుడే శిక్షించాడు కదా?" అంతే వాడు వలవల ఏడుస్తూ "నాశరీర గర్వం బలం చూసుకుని అహంకరించి మిమ్మల్ని హింసించాను."అని క్షమాపణ వేడాడు.ఆరోజు నించి  చెట్టుకింద కూచుని ఎవరైనా ఇంత అన్నంముద్ద పెడితే తింటూ కాలం గడపసాగాడు. 🌹
కామెంట్‌లు