బాలలం మేం బాలలం బంగరు భవితకు బాటలం "2"
అమ్మానాన్నల అవ్వాయి తువ్వాయిలం
ఆకసాన వెలిగే అందాల తారలం
"బాలలం"
వినువీధిన విహరించే శాంతి కపోతాలం
అన్నెం పున్నెం ఎరుగని అమాయకులం
చిట్టిపొట్టి పలుకుల చిన్నారులం.
"బాలలం"
కిలకిల నవ్వులు రువ్వే గువ్వలం
కుల మతాలు అంటని బాలకులం
చాచా నెహ్రూకి నచ్చిన చిచ్చర పిడుగులం
"బాలలం"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి