*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 017*
 కందం:
*పుట్టినది మొదలు పరసతి*
*బట్టకఁ జూచుటయు నింద పద్ధతి యనుచు*
*న్నట్టి పరుషుండు పుడమిం*
*బుట్టిన జనతతులఁ గీర్తబొందుఁ గుమారా !*
తా:
కుమారా! పుట్టినప్పటి నుండి ఎదుటి వారి భార్యను చేపట్టాలి అనే విషయం ఎవరూ ఒప్పుకోని, తప్పు అని చెప్పే వాడు ఈ భూము మీద ఉన్న అందరి మనుషులలో ఉత్తముడు అని పేరు సంపాదించు కుంటాడు....... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*మళ్ళీ మనం నడవ వలసిన, ఆచరణలోకి తెచ్చుకోవలసిన ఒకే ఒక ఉత్తమమైన మార్గం, రాముడు నడచిన మార్గం, "రామాయణం". ఒక రావణ బ్రహ్మ. ఇంకొక వాలి. ఇద్దరూ కూడా మనకు చెపుతున్న ఒకే విషయం పరస్త్రీ వ్యామోహం, మన జీవితాలను నాశనం చేస్తుంది అని. సీతమ్మను చెర బట్టి రావణ బ్రహ్మ నాశనము అయితే, తమ్ముడి భార్యను సొంతం చేసుకుని వాలి చనిపోయాడు. ప్రస్తుత మన సమాజంలో కూడా, ప్రతీ రోజూ ఏదో ఒక చోట దంపతులలో భార్య గానీ, భర్త గానీ పరాయి వ్యక్తి వ్యామోహం లో పడటం, లేదా బయటి వ్యక్తి భార్యాభర్తల మధ్యకు వచ్చిన ఫలితంగా హత్య కావించబడటం మనం చూస్తున్నాము / వింటున్నాము. మనల్ని, మన సమాజాన్ని రక్షింప గలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరబ్రహ్మ పరాత్పరుడు మనకు అందరకూ విజ్ఞతను ఇచ్చి, పరాయి స్త్రీలను జగన్మాత, పరమేశ్వరిగా తలచుకుని జీవించే ఉత్తమమైన పరిస్థితి మనకు కల్పించాలని............ కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు