మా ఆత్మీయుడు భాస్కర్ (12)---ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 కాకాని వెంకటరత్నం గారు  1968వ సంవత్సరం  గన్నవరం నియోజకవర్గం నుంచి  శాసనసభకు  పోటీ చేసిన సందర్భంగా  వారికి అత్యంత సన్నిహితులైన మా నాన్నగారు  అప్పటికే రాజకీయాలలో దూసుకుపోతున్న  కాకాని గారి శిష్యుడు  ముసునూరు రత్న బోసు  మా నాన్నగారి స్నేహితులు వామపక్షపాతులు  శనగల విశ్వనాథరెడ్డి  గుంటక పుల్లారెడ్డి  వారందరూ కూడా ప్రచారంలో పాల్గొని  నిజాయితీగా పనిచేసే కాకానివారిని గెలిపించారు. వారు పదవిలో ఉన్న నాలుగు సంవత్సరాలలో గన్నవరం నియోజకవర్గానికి  వారు  చేయగలిగినంత సహాయం చేశారు. గ్రామాలను బాగు చేయడం దగ్గర నుంచి యువతకు ఉద్యోగాలు ఇప్పించడం వరకు  కాకాని వారికి భేదాలు లేవని  ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని  నిజాయితీగా పని చేస్తారని తెలిసిన కమ్యూనిస్టు సభ్యులు అందరూ కూడా బాగా సహకరించడంతో  వారురెండవ సారి కూడా విజయాన్ని సాధించారు  వారి ఆశీస్సులతో గన్నవరం నుంచి 1983లో మళ్ళీ తిరిగి 1989లో  కాకాని గారి శిష్యుడు ముసునూరు  రత్న బోస్ రెండుసార్లు గెలిచాడు  ముఖ్యమంత్రుల అందరితోనూ చాలా సన్నిహితంగా ఉండి అందరి మంచితనాన్ని కోరుకున్నాడు. ఇదంతా మాకు కాకాని గారు నేర్పిన  ప్రవర్తనా నియమావళి  అందుకే కాకాని వారికి జీవితమంతా రుణపడి ఉంటాం. సీతారామయ్యగారి  పరిచయం పెరిగి  నీవు నేను ఒకటే అన్న స్థితికి  వచ్చేసరికి వారు చేసిన కార్యక్రమాలన్నీ  స్వాతంత్ర్య సమరయోధుల పేరుతో  జైలు శిక్ష అనుభవించిన దగ్గరనుంచి  నేను ప్రారంభించిన వీడియో క్యాసెట్ రికార్డింగ్  మీ మాటల్లో మీ జీవితం శీర్షిక  ఇలాంటి ఆదర్శప్రాయుడైన  వ్యక్తులను ఎన్నిక చేసి  ప్రశ్నోత్తర కార్యక్రమంగా  వారి మనసులోని మాటను  జీవితంలో ఏం చేయదలుచుకున్నారో దానిని పూర్తిగా  చేయలేని స్థితిలో వారి మానసిక స్థితి  వారు  చెప్పుకోవడానికి మొహమాట పడే  కార్యక్రమాలు  వాటిని ఎందుకు చేయాలనుకున్నారు  ఏ అవరోధాల వల్ల వాటిని చేయలేకపోయారు  అన్న విషయాలను కూలంకషంగా చర్చించి  రెండు గంటల నుంచి మూడు గంటల వరకు  వీడియోలో భద్రపరచడం వల్ల  రాబోయే యువతరానికి కూడా  వారి సేవలు  తెలియచేయవచ్చును అన్న సదాశయంతో  ఆ కార్యక్రమాన్ని  చేశాను.
సీతారామయ్య గారి కార్యక్రమం అయిపోయిన తర్వాత  మూడు నెలలకు భాస్కర్ రావు గారిని వారి ఇంటి దగ్గర కలిసి  నా మనసులో మాట చెప్పి రికార్డు చేయడానికి వచ్చాను  అంటే  ఎంతో వినయంగా  సంస్కారయుతంగా  నేను ఇంకా చాలా చిన్నవాడిని  నా కన్నా బాగా సమాజ శ్రేయస్సు కోరి  తమ జీవితాన్ని దానికే ధారపోసిన పెద్దవారు చాలామంది ఉన్నారు  వామపక్ష భావాలతో జీవితమంతా అంకిత భావంతో  నిస్వార్ధంగా పనిచేసినవారు  పుచ్చలపల్లి సుందరయ్య గారు ప్రథమ శ్రేణిలో ఉంటే చలసాని రామ కృష్ణ గారు ద్వితీయ శ్రేణిలో  ప్రథములుగా నిలుస్తారు. ముందు వారిని రికార్డు చేయమని సలహా ఇచ్చారు  వారి చెప్పినట్లుగానే చాలా చలసాని వారిని పిలిచి భాస్కర్ ఇంట్లోనే రికార్డు చేశాను  తనను గురించి తాను తక్కువగా చెప్పుకొని  తాను చేసిన పనులను కూడా పూర్తిగా చెప్పుకోని  అంకిత భావంతో పనిచేసే వారిలో  ప్రథమ స్థానంలో నిలిచింది  మా ఆత్మీయ మిత్రుడు భాస్కర్ రావు గారు.

కామెంట్‌లు