మా ఆత్మీయుడు భాస్కర్ (14) -ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.


 సంస్కృతీ సంప్రదాయాలకు  నిలయమైన భారతదేశం  వీధులలో కూరలు అమ్మినట్లు మణి మాణిక్యాలను  అమ్మిన దేశం. ప్రపంచ దేశాలన్నిటికీ ఆదర్శప్రాయమైన దేశం  ఎందుకు పరాయి పాలనకు లోను కావలసి వచ్చిందో తన సొంతం చేసుకోవడానికి భారతదేశంలో ఎన్ని వేల మంది  స్వాతంత్ర్య సమరయోధులుగా ముందుకు వచ్చారో వారి త్యాగ ఫలంగా మనం ఎలాంటి సుఖాలను అనుభవిస్తున్నామో అన్న విషయాలన్నీ పిల్లలకు తెలియాలి. మన చరిత్ర మనవాళ్ళకి తెలియకపోతే చరిత్రకు అర్థం లేదు. 

కనుక చరిత్రను తెలియజేసే పుస్తకాలను తప్పకుండా  గ్రంథాలయంలో ఉంచాలి  ఎన్నో కొత్త కొత్త పరిశోధనలు చేసి భారత దేశ ఔన్నత్యాన్ని పెంచిన  మహానుభావుల చరిత్రతో పాటు  వారు చూపిన ఫలితాలను కూడా తెలియజేయాలి  అని భావించి  ఆ గ్రంథాలను స్వీకరించడం జరిగింది. గ్రంథాలయానికి అనేక రకాల వ్యక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు  ఊరికే పత్రిక పై పైన చూడ్డానికి వచ్చేవారు ఉంటారు, బాగా చదివి వారికి నచ్చిన విషయాలను  వ్రాసుకుని దానికోసం పనిచేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు. కాలక్షేపం కోసం వచ్చి అవతల వారి పనిని చెడగొట్టేవారు ఉంటాడు. అలాంటి వారిని అందరిని గమనించి వారిని తీర్చిదిద్దడానికి ఒక వ్యక్తి తప్పకుండా ఉండి తీరాలి  అతను ఉద్యోగస్తుడైతే  అతనికి భృతి కల్పించినట్లు ఉంటుంది  బాధ్యతతో అతను పనిచేయడానికి అవకాశం ఉంటుంది  అలాంటి వారిని వెతికి ఎన్నిక చేయడం కూడా తక్కువ పని కాదు  ఆ వచ్చినవాడు పుస్తకప్రియుడు అయి ఉంటే  ప్రతి పుస్తకాన్ని నలగకుండా జాగ్రత్త చేసి  ప్రతి దాన్ని బైండ్ చేసి జాగ్రత్తగా నెంబర్లు వేసి వరుస ప్రకారం  చరిత్ర పుస్తకాలను ఒక ప్రక్కన  చిన్నపిల్లలకు పనికి వచ్చేది మరొక ప్రక్కన  ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయో అన్ని రకాల పద్ధతులలో దానిని అమర్చడం తెలిసి ఉండాలి  అలాంటి వాడిని ఎన్నిక చేస్తే  ఆ గ్రంథాలయం  ఉన్నత స్థితికి వస్తుంది  వచ్చే వారు కూడా పెరుగుతారు  పిల్లలు ఆనందంతోగంతులు వేస్తూ వస్తారు. వచ్చిన పిల్లలు బుద్ధిగా  తరగతులలో పాఠాలు చదువుతున్నట్లు చదివితే దాని వల్ల ప్రయోజనం ఉండదు  వారు చదివిన దానిని  వారికి అర్థమైన పద్ధతిలో వ్రాసుకునేలా  నోట్స్ తయారు చేయడానికి లైబ్రేరియన్ సహకరించాలి  మానసిక ఉల్లాసాన్ని పెంచడానికి  మెదడుకు మేత లాంటి  ప్రతివారం వచ్చే  పత్రికలలోని పజిల్స్  పూరించడానికి సహకరించాలి  దానివల్ల భాష  పట్ల గౌరవం పెరగడమే కాక  భాష పై అధికారం కూడా వస్తుంది. చెస్ లాంటివి  చదరంగం ఆటలో పిల్లలు చిన్నతనంలో  ఉత్సాహానికి ఆడితే వారి మెదడు  ఎంతో ఉన్నతంగా పనిచేస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు  రాజుని ఎలా కదపాలి  మంత్రి ఏం చేస్తూ ఉంటాడు సైనికుడు చూస్తూ ఉంటాడా  వీటన్నిటి పైన మనసు పెట్టి  ఎదుటివారు వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వేసి అతనిని ఓడించడానికి ప్రయత్నం చేస్తే తప్ప  విజయాన్ని సాధించలేరు  దానికి పెద్దల సహకారం చాలా అవసరం. అలాంటి పరిస్థితి గ్రంథాలయాలుంటే  పిల్లలు ఆణిముత్యాలు లాగా తయారవుతారు  భాస్కర్ స్థాపించిన ఆ గ్రంథాలయానికి  అప్పుడు సార్ధకత సిద్ధిస్తుంది.


కామెంట్‌లు