మా ఆత్మీయుడు భాస్కర్ (16);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఉపాధ్యాయ వృత్తితో ప్రారంభించిన నాగులపల్లి సీతారామయ్య గారి ఆలోచనలు ఎప్పుడూ సమాజ శ్రేయస్సు కోసం ఆలోచిస్తూ ఉంటాయి. తన విద్యార్థుల కోసమే కాకుండా వారి తల్లిదండ్రులు మొత్తం విద్యాధికులు అయితే తప్ప  గ్రామానికి ఉపయోగపడరని భావించి  విద్యకు మూలమైన గ్రంథాలను వెతికి దానికి ఒక ఆలయాన్ని నిర్మించి అందరినీ ఆ గ్రంథాలయానికి ఆహ్వానించి  కొత్త కొత్త విషయాలను  వారు తెలుసుకునే ప్రయత్నం చేసిన మొదటి వారు ఆ గ్రామంలో  అన్నే అంజయ్య గారు  కలపాల సూర్యప్రకాశ రావు గార్ల సాంగత్యంతో  అనేక మందిని  దేశభక్తులుగా మార్చడం కోసం ప్రయత్నం చేసి  దేశ స్వాతంత్ర్య ప్రచార  కార్యక్రమంలో ప్రధములుగా నిలబడి  అనేక మందిని ప్రభావితం చేసి  చివరకు చెరసాలకు  వెళ్లి వచ్చిన వ్యక్తి సీతారామయ్య గారు అలా పని చేసిన కోటేశ్వరరావు గారిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపారు చంపి వారి పేరుని శాశ్వతం చేశారు. సమాజంలో సామాన్యంగా ప్రతి ఒక్కరికి స్త్రీ అంటే  చాలా చులకన భావం ఏర్పడుతుంది. తనను కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఒక వ్యక్తిగా నిలబెట్టినది  తల్లి అన్న జ్ఞానం కూడా  లేదు  నీకు ప్రథమ గురువుగా ఉన్న తల్లి  మాతృమూర్తి గానే కనిపిస్తుంది కానీ స్త్రీ మూర్తిగా  మీకు కనిపించదా ఏ గ్రామంలో ఏ పురుషుడు అయినా త్యాగం చేయడానికి ముఖ్య కారణం స్త్రీ కాదా  ఆమె తలుచుకోకపోతే  ఏ పురుషుడైనా ముందడుగు వేస్తాడా? స్త్రీ అంటే రేణుకా దేవి  ఆమె తన బిడ్డను మాత్రమే కాకుండా  సమాజంలో అందరి శ్రేయస్సు కోరుకుంటుంది తన లాగానే ఎదుటి వారు కూడా హాయిగా ప్రశాంతంగా జీవించాలని  ఆశపడడమే కాదు దాని కోసం ప్రయత్నం కూడా చేస్తుంది  ఎవరైనా యాచకులు వచ్చినప్పుడు అమ్మా అని ధర్మం చేయమంటారు తప్ప  మగవాడిని ఎందుకు పిలవరు  ఆలోచించారా? మన మనసుకు అది తట్టదు.
గ్రామానికి సమాజానికి సహకరించాలి సాయ పడాలి అనుకుంటే  తను ముందు త్యాగం చేయడానికి సిద్ధపడాలి. ముదునూరులో విద్యా వ్యాప్తి కోసం  విశాలమైన స్థలంలో  తన ఖర్చుతో  మంచి   గ్రంధాలయాన్ని నిర్మించినది ఆ గ్రామానికి చెందిన ఒక స్త్రీ కాదా  ఆమె చదువుకున్న మనిషి కాదు ఆ గ్రామంలో దీనిని పెట్టమని ఆ గ్రామంలో ఎవరు ఆమెను కోరలేదు. స్వచ్ఛందంగా తనకు తానుగా ఆ నిర్ణయం  ఎప్పుడు 1933 లోనే తీసుకొని  దానిని దగ్గర ఉండి కార్య రూపంలోకి తీసుకువచ్చి  అనేకమంది చదువుకోవడానికి  అవకాశం ఏర్పరిచిన  ఆ స్త్రీ  పేరు జాస్తి బుల్లెమ్మ గారు  ఏ కొంచెం లోకజ్ఞానం ఉన్న పురుషుడైన  ఏ స్త్రీనీ చులకన చేయకుండా  బుల్లెమ్మ లాంటి వారికి పాదాభివందనం చేసి తీయవలసినదే  లేకుంటే సంస్కారహీనుడిగా మిగిలిపోతాడు సమాజంలో.కామెంట్‌లు