యువతలో మంచి మార్పు రావడానికి తనను గురించి కాకుండా సమాజం గురించి, దాని బాగు కోసం ఆలోచించడం మొదలుపెట్టింది బుల్లెమ్మ గారు. ఆమె కట్టించిన ఆ గ్రంథాలయం వల్లనే అని చాలా మందికి తెలియదు. కొల్లి అంజమ్మ గారు తమ నివాసం కోసం చాలా విశాలంగా ఇంటిని నిర్మించుకొని హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. ఆమె గ్రామంలో ప్రతి ఒక్కరు చదివి తీరాలి చదువు లేకపోతే ఎందుకు పనికిరారు అన్న ఆశయంతో ఆ మొత్తం ఇంటిని మిడిల్ స్కూల్ కి ఎవరూ అడగకుండానే గ్రామం కోసం ఇచ్చిన మహాతల్లి. ఆమే స్త్రీనే. మూడు సంవత్సరాల తర్వాత మరో స్త్రీ పాలడుగు సౌభాగ్యం గారు హై స్కూల్ కోసం ఇంకొక పెద్ద భవనాన్ని కట్టించారు దీనిని ఆమె బంధువు భాస్కర్ గారి తాతగారు ఉప్పలపాటి బ్రహ్మయ్య గారు సున్నం స్థానికంగా తయారుచేసి డాబా కట్టారు. సిమెంట్ అసలు వాడలేదు. ఆ కట్టడం ఈనాటికీ శాశ్వతంగా నిలిచి ఉంది. ఇలాంటి స్త్రీల వలన విజ్ఞానం విద్యా అన్న విషయం ప్రతి మగవాడు తెలుసుకోవాలి
కొంతమందిని సన్మానం చేస్తారు ఎందుకు దానివల్ల ఏమిటి ప్రయోజనం వారు చేసిన పనిని భట్రాజుల లాగా పొగడడం కోసం కాదు ఆ కార్యక్రమం. వారు చేసిన కార్యక్రమాలను ఆపకుండా మరికొంత ముందుకు వెళ్లి సమాజానికి ఉపయోగపడే పనులు చేయమని భుజం తట్టి ప్రోత్సహించడం కోసం. అలా జరిగినప్పుడు ఆ వ్యక్తి ఇతోధిక స్ఫూర్తితో మరి కొన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. భాస్కర్ తమ తల్లిదండ్రులు సీతారామయ్య సోమి దేవమ్మ గార్ల సంస్మరణ సభలో భాస్కర్ తో పాటు కొల్లి బ్రహ్మయ్య గారు ప్రధానోపాధ్యాయుడు తుమ్మల రామ బ్రహ్మం కలిసి 70 సంవత్సరాల లో ఆ గ్రామ అభివృద్ధికి కృషి చేసిన ఎనిమిది మందికి సన్మానం చేశారు ఒక పర్యాయం యువకులకు మరొకసారి మహిళా మణులకు ఇంకోసారి వృద్ధులకు ఈ సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు భాస్కర్.
కరిముద్దుల రామలింగేశ్వర రావు గారు ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠాలు చెప్పడానికి నీతులు చెప్పడానికి కాదు వారు ఆచరించాలి కూడా అన్న అభిప్రాయం కలిగిన తాను పదవీ విరమణ చేసిన తర్వాత కూడా తనకు వచ్చే పెన్షన్లు అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఇబ్బందులలో ఉన్న వారికి ఆసరాగా నిలబడడానికి ఉపయోగించారు తప్ప స్వార్థానికి ఉపయోగించని నిస్వార్థపరులు అలాంటి వారి వల్లనే ధర్మం ఈనాటికి నిలబడి ఉంది. వారిని చూసి మరి కొంతమంది అయినా అలా చేస్తే సమాజంలో అన్నార్తులు ఉంటారా అని భాస్కర్ ప్రశ్న...?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి