పాపం పడతి (3);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాల విద్యార్థిగా  జీవితం ప్రారంభించేసరికి  తానేదో ఉన్నతంగా అనుభూతిని పొంది  అందరికన్నా నాకు ఎక్కువ తెలుసు అన్న  భావంతో వెళ్లి  అక్కడ తనను మించిన  ఆలోచనా పరులను  చూసి  వారందరితోను  స్నేహాన్ని కలుపుకొని  ఆ వయసుకు తగినట్లుగా  మనసును అదుపులో ఉంచుకొని బుద్ధిని పెంచుకొని ఎలాంటి జగడాలకు తావు లేకుండా మర్యాదలను ఇచ్చిపుచ్చుకుంటూ కార్యక్రమం చేస్తూ ఉంటారు  ఎక్కువగా వీరు బాగా కలిసి ఉండేది మాటల్లో చిన్న తరగతిలో ఆడిన ఆటలకు ఇక్కడ ఆడుతున్న ఆటలకు  సంబంధం ఉండదు  కనుక నేర్చుకోవడానికి ప్రావీణ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేసి  గురువుల సహాయంతో కాని స్నేహితుల సహకారంతో కాని తాను ఓడిపోకుండా అందరిని గెలవాలి అన్న  పట్టుదలతో కృషి చేస్తాడు. అది పాఠాలు చదవడంలో కూడా ఉంటుంది ఎవరికి వారు ఎదుటివారి కన్నా బాగా మార్కులు తెచ్చుకోవాలని  ప్రయత్నం చేసే వాళ్లే.
ఆ వయసులో కొన్ని రహస్యాలను పంచుకోకుండా మనసులోనే దాచుకుంటారు  చెపితే ఏమంటారో అని  భయం  జీవితంలో వయసుకు సరిపడిన మార్పులు రావడం  సహజం  ఆ మార్పులను ఎలా అర్థం చేసుకోవాలో  దానిని గురించిన వివరాలు ఎవరి ద్వారా తెలుసుకోవాలో వారికి అర్థం కాదు. కన్న తల్లిని మించిన ఉపాధ్యాయుడు ప్రపంచంలో ఇంకెవరున్నారు కానీ  పెరటి చెట్టు  కూరకు పనికిరాదు అన్న సామెతగా  అమ్మ కన్నా నాకే బాగా తెలుసు అన్న దృష్టితో అమ్మకే పాఠాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు  కానీ వాటిని తెలుసుకోలేనంత అమాయకురాలా అమ్మ. ఎప్పుడో మాట్లాడబోయే మాటలు కూడా  గ్రహించగలిగిన సూక్ష్మగ్రాహి అమ్మ నవ్వితే పేగులు లెక్కించవచ్చు అన్న సామెతలు ప్రక్కన పెట్టి  నవ్వకపోయినా లెక్కించగలిగిన సూక్ష్మగ్రాహి అమ్మ. కనుక ఏకాంతంగా ఉన్న సమయంలో బిడ్డను పిలిచి  శరీరంలో ఈ మార్పు వచ్చిందా ఆ మార్పు వచ్చిందా అని  అడిగి తెలుసుకుని  దానికోసం ఏం చేయాలో పరిష్కార మార్గాలను  చెపుతుంది అమ్మ  ఆ ఇంట్లో అమ్మ ఉపాధ్యాయిని మాత్రమే కాదు  మంచి వైద్యురాలు కూడా  ఏ బిడ్డకు  గాని పెద్దలకు కానీ ఏ చిన్న రుగ్మత వచ్చినా దాని నిగ్రహించి దానికి కావలసిన  పదార్థాలను సమకూర్చి వారికి ఇవ్వడంలో ఆమె దిట్ట. అలాంటి అమ్మను మర్చిపోయి  తన లాగానే అమాయకంగా ఉన్న స్నేహితుల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే  పిల్లలను చూసి 
ఆనందిస్తుంది తప్ప  జీవితంలో ఎప్పుడు కోపగించుకోవడం తెలియదు.  అంత సున్నితమైన మనసు అమ్మది. వెన్నెల వలె కరిగిపోయే మనసును అమ్మ నుంచే మనం నేర్చుకోవాలి....  నేర్చుకుంటారు కదా.


కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం