ఉన్నత పాఠశాలలోకి వచ్చిన విద్యార్థులు సామాన్యంగా ఆ వయసుకు తగిన పనులు చేయడానికి ఆయత్తపడతారు. దానివల్ల ఎదుటివారు ఎలా బాధపడతారు. మన చేష్టల వల్ల సూటి పోటీ మాట్లాడవల్ల ఎదుటివారి మనసు ఎంతో ఖేదిస్తుంది అన్నది ఆ క్షణాన వారికి అర్థం కాదు. జీవితంలో స్థిరపడి ఎప్పుడో ఒక సందర్భంలో పాత విషయాలన్నీ జ్ఞాపకం వచ్చి ఆ రోజు నేను ఇలా అన్నాను వారు ఎలా బాధపడ్డారో అది నాకు జరిగితే నేను భరించగలనా అన్న ఆలోచనతో సతమతమై గతం గతః జరిగింది ఏదో జరిగిపోయింది కదా నేను అలా చేసి ఉండకూడదు అని అనుకున్నా దానిని సరిదిద్దుకునే అవకాశం తిరిగి వస్తుందా మళ్లీ విద్యార్థి దశకు అవకాశం లేదు కదా జీవితంలో ఏ అవకాశమైన ఒక్కసారి వస్తుంది తిరిగి తిరిగి రాదు. నిజానికి ఏ వయసులో జరిగే పనులు ఆ వయసులో జరిగి తీరాలి లేకుంటే ఆ జీవికి ఆనందం ఉండదు తరువాత తీరిగ్గా నా విద్యార్థి జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని బాధపడడం తప్ప మిగిలింది ఉండదు ఆడపిల్లలైనా మగ పిల్లలైనా వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే వారిని వీరు చూసుకోవడం వీరిని వారు చూసుకోవడం మధ్యలో ఏవో మాటలతో వారిని ఉడికించడం చేయకపోతే ఆ వయసుకు అర్థం లేదు అది జరిగిన తర్వాత ఏ ఆడపిల్ల, మగ పిల్లవాడితో కానీ ఏ మగ పిల్లవాడు ఆడపిల్లతో కానీ తన బాధను వ్యక్తం చేసుకోవడానికి అవకాశం ఉండదు మొహమాటం అడ్డు వస్తుంది అందువల్ల ఆమె స్నేహితురాలి మధ్య తాను ఎవరిని బాగా నమ్ముతుందో వారితో మాత్రమే మాట్లాడుతుంది ఈ విషయాలు. మగ పిల్లవాడు కూడా అదే స్థితి వాడి సన్నిహితులకు తప్ప మరొకరికి చెప్పడు ఇది సహజం. దీనివల్ల ఒకరిపై ఒకరు ఉక్రోషాన్ని పెంచుకొని ప్రత్యామ్నాయంగా కోపాన్ని ఎలా తీర్చుకోవాలా అని సన్నిహితులతో ఆలోచన చేస్తూ ఉంటారు అది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు ఇద్దరు ముగ్గురు కలిసి చేయాలి ముందు ఎలా చేస్తే మన కక్ష తీరుతుంది దానికి సంబంధించిన ప్రణాళికను ఏర్పాటు చేసుకొని పద్ధతి ప్రకారం వారిని ఉడి కించడానికి ప్రయత్నం చేస్తారు అలా హీరో కనపడకూడదు మరో మాట మాట్లాడడానికి అవకాశం లేక తాను చేసిన దానికి వీరు బదులు తీర్చుకుంటున్నారు అని మరింత కోపం తెచ్చుకొని తన స్నేహితురాండ్రాతో మంతనాలు జరిపి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఆటలలో కానీ వక్తృత్వ పోటీలలో కానీ తమ ఉక్రోషాన్ని వెళ్ళగక్కుతూ వారి మనసులో ఉన్న బాధని తీర్చుకుంటారు ఉన్నత పాఠశాల చదువు అయ్యేంతవరకు ఇలా కొనసాగుతూనే ఉంటాయి వారి చిలిపి పిల్ల చేష్టలు.
పాపం పడతి (4);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి