పదవ తరగతి పూర్తి చేసే సమయంలో 9-10 తరగతులలో వారి బుద్ధి మరో రకంగా మలుపు తిరుగుతుంది. ఒక్కొక్కరి పైన మంచి అభిప్రాయం ఇంకొకరిపై చెడ్డ అభిప్రాయం కలగడం సహజం. అభిప్రాయాలు ఎందుకు ఏర్పడతాయో మానసిక విశ్లేషకులు తప్ప మరెవరు చెప్పలేరు వారి చేష్టల వల్ల కావచ్చు, చెతురతతో కూడిన వారి మాటల వల్ల కావచ్చు, కారణాలు ఏవైనా అభిప్రాయాలు మాత్రం మారవు పిల్లలలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు. వారు మధ్యాహ్నం తెచ్చుకున్న భోజనంతోపాటు వారి తల్లి వారికి కావలసిన చిరు తిండిని కూడా ఏర్పాటు చేస్తుంది చిన్న తరగతుల్లో ఉన్న అభిప్రాయాలు మారిపోయి వీరు తెచ్చుకున్నది వారికి వారు తెచ్చుకున్నది వీరికి పంచుకుంటూ సరదాగా నవ్వుతూ తుళ్లుతూ కాలక్షేపం చేస్తారు. అలా విశ్రాంతిగా కాలక్షేపం చేస్తున్న సమయంలో వారి మనసులోని మాటలన్నీ బయటకు వస్తాయి ఆ కుర్రోడు చూసావా ఎంత ఛండాలంగా ఉంటాడో వాడి రంగు చూసినా, వాడి మోటుతనం చూసిన ఎవరైనా అతనిని ఇష్టపడతారా? వాడేమిటే మన చుట్టూ తిరుగుతాడు అంటూ ప్రారంభమైన సంభాషణలు ఒక పిల్లల మనస్తత్వాలు అన్నిటినీ ఏకరువు పెడుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఉదాహరణ చెప్పుకుంటూ తమకు జరిగిన విషయాలను సమగ్రంగా చెప్పుకుంటూ దానికి పరిష్కార మార్గం ఏమిటి అని ఆలోచిస్తారు మన పెద్దలు చెప్పినట్లు మంచికి మంచి చెడుకు చెడు ఉంటుంది కదా మంచివారికి మంచి పద్ధతిలోనూ చెడ్డవారికి చెడ్డ పద్ధతిలోనూ బుద్ధి చెప్పడానికి వీరు అనేక పద్ధతులను ఏర్పాటు చేసుకుంటారు ఆ వయసుకు ఇవన్నీ చాలా ఆనందంగా అందంగా కనిపిస్తుంది.
మరి మగ పిల్లలు మాత్రం తక్కువ తిన్నారా వీరు కూడా ఆ వయసు వాళ్ళే కదా టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా ఎవరో ఒకడు ప్రారంభిస్తాడు. ఏమిటిరా ఆ అమ్మాయి ఏమనుకుంటుంది తన గురించి, హేమమాలిని, వైజయంతి మాల స్థాయిలో ఊహించుకుని అలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుందా అన్న తర్వాత దానిని ఆసరా చేసుకొని మిగిలిన వారు వారి మనసుల్లో ఉన్న అభిప్రాయాలను ఒక్కొక్కరు వెళ్లగక్కుతూ ఉంటారు ఒకడంటాడు ఆ అమ్మాయి నన్ను బాగా ఇష్టపడుతుంది రా నిజంగా పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను అన్న స్థాయిలో మాట్లాడుతూ ఉంటాడు ఆ వయసులో పెళ్లి, ప్రేమ లాంటి విషయాలను మాట్లాడటం వారికే చెల్లు అలాంటి ఆలోచనలు రాకపోతే ఆ వయసుకు అర్థమే లేదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి